గడచిన మధుర చేదు క్షణాలన్ని........
సంధ్యా కాలపు సుర్యుడి వెలుగులో........
సంద్రపు ఒడిన సేదతీరుతున్న వేళ
ఎగిసి వస్తున్న కెరటాల సవ్వడి.......
కాలచక్రంలో కరిగిపోయిన వాస్తవాలని జ్ఞప్తికి తెస్తుంటే
ఆ మధుర స్మ్రుతుల తీయదనాని పెదవులు దరహాసం చెస్తున్నా.........
మది మాత్రం ఆ అనుభూతుల స్మరణలో........
భారంగా మారి ఎందుకు భాదిస్తుంది?
గత కాలపు సుందర అనుభవాలు కూడ.......
సంద్రపు అలలలో చేరి ఎందుకు కల్లోల పరుస్తాయో..
గడచిన మధుర చేదు క్షణాలన్ని........
భవిష్యత్తు లో భాదనే ఎందుకు మిగులుస్తాయో....?