Tuesday, September 6, 2011
నల్లని ఙ్ఞాపకాలు సిరాగా మార్చి, కాగితాలపై అక్షరాలను పొందు పరిచే ప్రయత్నం
రాయడం నాకు ఇష్టం మొదలైంది నీవల్లే
కదిలించగల భావుకత వుందని కాదు
కదిలిన నా హృదయస్పందనకి అసలైన అక్షరరూపం కోసం
రాయడం నాకు అవసరం
పరిపక్వత నిరూపణ కోసం కాదు
పరిమితులులేని మనసుపయనానికి అక్షరదిక్సూచి కోసం..
ఏన్నోసార్లు నీవిషయంలో ఓడిపోయిన నేను
ఎంతగా ఇంకా ఓడీపోతున్నానో తెలపడంకోసం
రాయడం నాకు అలవాటు చేసిందే నీవు
ఆలోచనాసరళి మెప్పుదల కోసం కాదు
మసకబారినా జ్ఞాపకాల సమాహారం ఇది
రాయడం నాకు ఆనందం కాదు
చిందాడే అందమైన పదాల కూర్పుకై కాదు
చిరునగవుని అద్దిన క్షణాల అక్షరసంయోగం కోసం
రాయడం నాకు అమూల్యం
తప్పొప్పుల సమీక్షాసమాహారాల కోసం కాదు
తడబాటులేని విలువల విలువైన అక్షరపాఠం కోసం
రాయడం నాకు స్వార్ధం
నాకవసరంలేని అంగీకారాల కోసం కాదు
నల్లని ఙ్ఞాపకాలు సిరాగా మార్చి, కాగితాలపై అక్షరాలను పొందు పరిచే ప్రయత్నం
రాయడం నాకు వేదన..బరించలేని భాద తట్టుకోలేని గుండె కోత..
మనసు చచ్చిన మనిషిగా తట్టుకోలేక రాస్తున్న అక్షరాలే ఇవి
రాయడం నాకు అతి ముఖ్యం
ప్రేరేపించడం కోసం కాదు
నా గుండె చప్పుడు ను చెప్పడం కోసం ప్రియా
రాయడం నాకు అవసరం
నేనేమిటో తెలుపుకోవడానికి కాదు
నేనేమిటో నీవు మరవకుండా తరచి చూడటంకోసం..
ఎప్పుడైనా నేనంటూ దూరం అయితే నీ వెతుకులాటలో..
ఈ అక్షరాల సమాహారాన్ని చూసి అప్పుడైనా అర్దం చేసుకుంటావని..
ఎంత తరచి చూసినా నాలో పేర్కొన్న భావలివి అని తెలుసుకో..
నీవు నిజం తెల్సుకునే సమయానికి ..
ఈ అక్షరాలే నీకు మిగిలేది..నేనుండనుగా
ఇంత ప్రేమ నీపై పెట్టుకున్నా నీపై ఇప్పుడన్నా నన్ను అర్దం చేసుకుంటావా..
నేను ఇక లేను అని తెలుసుకున్నాక ఒకన్నీటి బొట్టు రాలుస్తావా..
వద్దు నాకోసం ఆ కన్నీటీ ని వేష్టు చేయకు అనేది నాసలహా..
విలువలేని నాలాంటి మనుషుల కోసం విలువైనా కన్నీరు కార్చకు..
ఒక్క కన్నీటీ బొట్టు రాల్చవని తెలుసు కాని ఎక్కడో..?
అయినా నా పిచ్చి గాని నీను నేనెందుకు గుర్తుంటాను చెప్పు..
గుర్తు ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి.. WhO am I dear
ఇప్పుడనుకుంటున్నావు ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాడు ..
పోయాక కూడా ఇలా చిరాకు పెడ్తున్నాడని అనుకుంటున్నావుకదూ...Sorry Dear
Labels:
కవితలు