Sunday, September 4, 2011
మట్టిలొ కలిసిపోయే దేహన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు....
మనసు ప్రేమను పొందలేని శిల్పమా? లేక
నీ కన్నులు కోరుకునే అందం నాలో కనిపించలేదా?
ఐనా అందం కాదు నేస్తమా మదిని ఆనందింపజేసేది....
ఐశ్వర్యం కాదు ప్రాణమా మనసులు ఐక్యం చేసేది....
ఒక్కసారి నీ మనసుతో నన్ను చూడు....
నా ప్రేమ శికరంపై రాణిలా కూర్చున్న నీ రూపం కనబడుతుంది....
ఐనా ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో మాయచేస్తున్నారో గుర్తుపట్టలేకున్నావు.....
మట్టిలొ కలిసిపోయే దేహన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు....
శాస్వతమైనా నా చెలిమి కాదని.... వెల్లిపోయావు నిజం తెల్సుకున్న రోజు ..
భాదపడ్డా బంగపడ్డా నీకు మిగిలేది దుక్కమే...అప్పుడు నేనుండనుగా..
నాకోసం ఎంతవెతికినా పరుగులు తీసినా నేను కనిపించను అవకాశమే లేదు..?
Labels:
కవితలు