Thursday, September 8, 2011
ఎందుకు నీవు మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలి పోయావు..?
చిరునవ్వుల చిరుజల్లు
స్పర్థను కడిగేసి౦దిగా
ఇక క్షమాపణల వారధి ఎ౦దుకురా మనమధ్య
మార్ధవ౦తో నువు పలికిన నా పేరు..
చెప్పేసి౦ది నీ మనసులోని నా స్థానాన్ని
చెరిపేసి౦ది నీపై ఉన్న ఆ కోపాన్ని మరిచేవాడిని
నిజ౦ చెప్పనా
అది కోప౦ కాదురా... చిలిపి అలుక.
ఓ రోజు మాట్లాడుకోవడం మరో రోజు నీమీద అలగడం
నాకు చాలా బాగుడేది మనస్సు ఎక్కడెక్కడో విహరించేది
నువు బ్రతిమాలుతు౦టే బాగు౦టు౦ది మరి
నాకోస౦ నువు పడే
ఆరాట౦ చూస్తు౦టే... తృప్తిగా ఉండేది చిపిపిగా నవ్వుకునే వాడిని
నాకోస౦ ఒకరున్నారని గొప్పగా చెప్పాలనిపిస్తు౦ది.
అది ఒకప్పుడు అది ఇప్పుడు మరిచిపోలేని జ్ఞాపకం..
ఎందుకు నీవు మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలి పోయావు..?
ఎందుకిలా నాకుదూరం అయ్యావని నిలదీయాలని ఉంది.
నేనాపని చేయలేను నీవు భాదపడతావు అదినకిష్టం ఉండదుగా
నీవు హేపీగా ఉండాలి అదే నేను ఎప్పుడూ కోరుకునేది.. Be Happy Dear
Labels:
కవితలు