Friday, September 2, 2011
నివే వినేందుకు సిద్దంగా లేవు వెరొకరికి వినాల్సిన అవసరం ఏంటీ..
దైవంతో పోరాడి ఘఘనానికి ఏగక
స్వర్గాన్ని వీడి
నాకై ధరణి పై తోడుగా ఉన్నావా నేస్తమా
మూడడుగుల లోతులో
నీ సహాచర్యంలేని నాకు
నీతో సహాగామనమే మేలు
నీకై వస్తున్న ప్రియతమా ..
నీవు నాకోసం ఎదురు చూడటంలేదు..
నన్ను వీడి నోవంటూ మరొకరి....?
నీవు వదలి వెల్లినా నీజ్ఞాపకాలే తోడుగా..
నీ సాహచర్యిపు నీడలే నిజాలుగా చేసుకుంటూ..
నీవు లేక బ్రతుకు భారంగా ..
కఠిక చీకట్లో గడుపుతున్నట్టు ఉంది నాకు..
కన్నీటి కడలిలో ఈదుతున్నా..
ఓడ్డుకు చేరుతానన్న నమ్మకంలేదు..
ఒకప్పుడు చేసుకున్న బాసలు మారాయి..
చెప్పినమాటలు నీటి మూటలయ్యాయి..
ఎవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను..
నివే వినేందుకు సిద్దంగా లేవు వెరొకరికి వినాల్సిన అవసరం ఏంటీ..
విధిని ఎదురించలేక...అందుకే విధికి తలవంచా..
ఎప్పుడు ఏక్షనం అయినా ఈ ఊపిరి ఆగిపోతుంది..
ఒకప్పుడు నీకు చెప్పి వెలదాం అనుకున్నాఇప్పుడు అనిపించడంలేదు...
నీకూ తెలియదు..ఏప్పటికో తెలుస్తుంది..అప్పుడు నీవు ఎంత హేపీగా ఫీల్ అవుతావో కదా...?
Labels:
కవితలు