ఓటమి అంచున ..మనసున ..పలికిన...మాట
కాలం చెల్లిన నాణెం శిరము పై నిలిచిందా
మనసే విప్పని మౌనం నీతో నడిచిందా
తీరం చేరని, శాంతం ఎరుగని తరంగంలా
మనసే తడబడి అడుగిడేనా లోక సంద్రంలో
ఆ సుడిగుండాల గతిలో నేర్చావా ఎన్నో శ్రుతులు
ఏ పాటకు చేరని నిరాశ్రుతులు అంతా మాయ అనీ తెలుసు
ఆపై ఏమీ లేదనీ తెలుసు అని క్రొత్తగా అలసట
నేర్చి పలికేనా గెలుపే ఎరుగని ప్రాణం
భయాల భూకంపంలో ధైర్యపు పునాది లేని గుడిసె నైతిని
పునాది లేని పూరిల్లు ప్రమాధమేమని ప్రశ్నించకని