Wednesday, September 7, 2011
కొన్ని గుండెలు పగిలేలా అరిచిన అరుపులు ఎవరు వినలేరు
జడివానలు జీవిత కాలం ప్రయత్నించి అలసి ఆవిరిపోయాయి ..............
మలయమారుతాలు స్వభావం మారిపోతుందనే భయం తో మద్య లోనే వెను దిరిగాయి .........
సముద్రాలు దాని తీవ్రత తెలియక తమ గర్భం లో దాచుకున్నాయ్ .................
జీవమా , నిర్జీవమా,దేవుడా ,దెయ్యమా......ఎవరైతేనేం ...........
తన ఉచ్వాస , నిశ్వాస ల ఉనికి కూడా భరించలేరు ..........
కొన్ని వేదనలకి జోల పాటలుండవు.......
కొన్ని గుండెలు పగిలేలా అరిచిన అరుపులు ఎవరు వినలేరు ..
దాన్ని మండనివ్వండి .......
తన శరీరం చితిలా కాలి పోయేవరకు .........
ఆ జాడలు తనకో కొత్త రూపాన్ని ఇచ్చేవరకు .....
మనం అనుభవించలేని ఆవేదనలో సౌందర్యాన్ని వెతుక్కొనే వరుకు .....
అక్కడో అగ్ని పర్వతం మండుతుంది దాన్ని మండనివ్వండి
Labels:
కవితలు