Saturday, September 3, 2011
కలల ఆశల తీరం కోసం కష్టం లా కన్నీరు కడలిలో కుమిలిపోతున్నా నేస్తమా ....
చిరు నవ్వులు చిందించే నవవసంతం కోసం చేకోర పక్షి లా ఎదురు చూస్తున్నా నేస్తమా ....
కలల ఆశల తీరం కోసం కష్టం లా కన్నీరు కడలిలో కుమిలిపోతున్నా నేస్తమా ....
గెలుపు చెలిమి కోసం ఓటమి ఎడారి లో పయనిస్తునావా నేస్తమా...
నా అనే బంధం కోసం ఎవరులేని , ఎవరికీ కానీ ఒంటరితనం తో స్నేహం గా సాగిపోతున్నావా నేస్తమా ...
... దిగులు పడకు...అధైర్యపడకు .... నేటి గురించి
కన్నీరు పెట్టకు ...క్రుంగిపోకు... ...నేటిని తలచి
ఓటమిని ఒప్పుకోకు..ఆగిపోకు ....నేటి పలితం చూసి
ప్రతి అస్తమయం రేపటి ఉదయానికి సూచన అయితే .....ప్రతి ఓటమి రేపటి విజయం కదా..
ప్రతి శిశిరం వసంతానికి దారి తీస్తునప్పుడు.....ప్రతి బాధ ఆనందపు అడుగు కదా .....
సాగిపో నేస్తమా ....
ప్రజ్వల ప్రబంజనం తో .......ఓటమి ఓడించేవరకూ ..............
నిరంతర ప్రయత్నం తో ....గెలిచి నిలిచే వరకూ.....
నిశ్చల మనస్సు తో ...... చివరి శ్వాస అగేవరకూ.....సాగిపో నేస్తమా ..
Labels:
కవితలు