నువ్వు దోచుకెళ్లిన హృదయానికి.. చూపులేదు నిన్ను చూపటానికి....
నన్ను నీవుగా మార్చిన జ్ఞాపకాలకు.. గొంతులేదు నీతో చెప్పడానికి....
ఈ హృదయం.. ఇక నీ హృదయం....
ఉండలేనే నిన్ను చూడనిదే ప్రతీ ఉదయం....
సకలం నీవై రావే, చెలీ.. నా ప్రేమ లోకంలో....
సర్వం నీవైయావే, సఖీ.. నా జీవన గమనంలో....
నువ్వు నా దానవే.. అని నేడు నా ప్రేమపై ప్రమాణం చేయి....
నువ్వు నా నీడవే.. అని చెప్పు నా ప్రాణం పోయినా వదలను నీ చేయి....
నువ్వు నమ్మినా నమ్మకున్నా నిన్నే నింపుకున్న హృదయం....
ఈ వాగ్దానం చేస్తుంది, ఏదో ఒక రోజు ఋజువు చేస్తా ప్రియతమా.. నా ప్రపంచమా....!