Thursday, September 1, 2011
నా ఆత్మ తనకి తోడుగా ఉంటే తన గమ్యాన్ని సుగమం చేసుకోదా;
కాంతి వెలిగినా అది ప్రకాశవంతంగా లేనే లేదు
నేను ఖచ్చితమైన విధంగా వెలిగిస్తే రాక్షస రాత్రి కనుమరుగవదా;
రాత్రి వచ్చింది గానీ ఆ వెన్నెలలో తగినంత మాధుర్యం లేనే లేదు
నేను ఆ రాత్రిని తేనెతో సంతోషపెడితే అది తీయని రాగాన్ని ఆలాపించదా;
పత్రహరితం లోపించిన ప్రకృతి వేర్లలో పోషక శక్తి లేదు
ఆ వేర్లకి నా రక్తాన్ని పోస్తే ఆమె ఆకాశాన్ని అలంకరించదా;
సగం ఆర్ధ్రతతో సగం ఆగ్రహంతో ఉన్న ప్రేమలో సంతోషమే లేదు
తన మనసులో నా ప్రేమని నింపితే ఆ ప్రేమకి ఆత్మపుష్పం పూయదా;
గమ్యం కోసం జన్మించిన జీవితానికి దారి తెలియక దిక్కు లేదు
నా ఆత్మ తనకి తోడుగా ఉంటే తన గమ్యాన్ని సుగమం చేసుకోదా;
నొప్పి తెలియని పరమాత్మకి తన లోకంలో ఔషధం లేదు
నేను ప్రేమతో ప్రార్ధన చేస్తే గాయపడిన స్వర్గం పులకించదా
Labels:
కవితలు