Tuesday, September 20, 2011
ఆ రోజులు గుర్తున్నాయా..? నేనింకా నీకు గుర్తున్నాన్నా..?
ఆ రోజులు గుర్తున్నాయా..? నేనింకా నీకు గుర్తున్నాన్నా..?
ఆమాట అనటానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నా..
పోయిన సంత్స్రం ఇదేరోజులు 13,14,15,16,17,18,19..
నాకు ఇవన్నీ జీవితంలో మర్చిపోలేని రోజులు నిజంరా..?
13 తారీకునుంచి నామనస్సు మనస్సులో లేదు ఎందికిలా జరిగిందాని
నామీద నాకు చిరాకు నేను కూడా నటించి ఉంటే మనం ఎప్పటిలాగే ఉండేవాళ్ళం కదా..
ఒక్కోసారి అనిపిస్తుంది వాడు నాకెందుకు ఫోన్ చేయాలి..
నేను ఎందుకు రెస్పాడ్ అవ్వాలి తను బాగుండాలని నేనెందుకు కోరుకోవాలి..
తన ప్రేమ మీద నమ్మకం లేక నన్ను బలి చేస్తున్నాడని తెలిసీ నేనెందుకు కాంగా ఉండాలి ..
మనం జీవితం లో మంచి స్నేహితులుగా ఉండకుండా ఏంచేయాలో ప్లాన్ గా చేశాడు..
ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ్డ కొట్టాడు తిప్పుకోలేని చెప్పుకోలేకుండా ..
జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడుతున్నాడని తెల్సి నీవు కాంగా ఉన్నావు
వాడు కొట్టిన దెబ్బకు భాద పడతాను అని తెల్సి నీవు కాంగా ఉన్నావే అది ఇప్పటికీ భాద అని పిస్తుంది
నీవెక్కడ భాదపడతావో అని ఎన్నో సార్లు కాంప్రమైజ్ అయినట్టే వాడూ హేపీగా ఉడాలని చూశా..చివరికి
నీవే నామీద దాడికి వచ్చేలా చేశాడు...అయినా ఏం అనలేక పోయా ..
ఆరోజు మొదలైన భాద ఇప్పటికి గుడెళ్ళో దిగిన కత్తినా ప్రతిక్షనం బాదిస్తూనే ఉంది..
నాగురించి నీకు తెలీదా ...అంత తేల్సి వాడు చెప్పిదల్లా ఎలా నమ్మావన్నది నాకు ఇప్పటికీ అర్దంకాదు..
నాగురించి పూర్తి గా తెల్సు నేనేంటో తెల్సు But ఎందుకిలా జరిగింది నేనేం తప్పు చేశాను.
ఒకప్పుడు నామీద ఉన్న నమ్మకం ఎమైంది..ఇంతలో అంతలా ఎందుకు మారావు...
అందరి లాంటి అమ్మాయివి కాదు అని నా గట్టి నమ్మకాన్ని ఎందుకు ఒమ్ముచేశావు
ప్రాణం పోయే పరిస్థితుల్లొ కూడా నీవు నీవు లాగే ఉంటావు మారవు అని నమ్మేవాన్ని.
కానీ నీవు అందరి లాగానే బిహేవ్ చేశావు..ఎందుకని అడుగలేను..
నాకేం జరుగుతుందో అని కంగారు పడ్డ నీవు ..ఒక్కోసారి ఏం జరిగినా మౌనంగా ఉన్నావెందుకు..
ఆ మౌనం వెనుక ఉన్న అర్దం ఏంటి ఎదైనా జరిగితే బాగుడనే అనిపిస్తుంది నాకు
అప్పటి రోజులు నీకు గుర్తున్నాయా..నేను మర్చిపోలేకపోతున్నా నీవు మర్చిపోయావుకదా..
నాకేదో జరిగిపోతోంది ..కనీసం నీకు ఒక్కసారికూడా చూడాలనిపించలేదు కదూ ..
అవును చూడాల్సిన , గుర్తు పెట్టుకునేంత గొప్పస్నేహం కాదు కదా నాది..
ఇలా జరుగుతుందని వాడి మెటాలిటీ నీతెల్సి నన్ను ఎందుకిలా చేశావు.
నేను ఏపరిస్థితుల్లో నీకు పరిచయం అయ్యానో తెల్సు అంతకంటే ఎక్కువ చెప్పుకోలేని భాధ మిగిల్చావెందుకు
తప్పుచేసిన ఖైదీలకు నిజం చెప్పుకునే చాన్సు ఇస్తారు మరి కనీసం నా వర్షన్ ఎప్పుడూ వినటానికి ఎందుకు ట్రై చేయలేదు
నామీద ఎవ్వరు ఏం చెప్పినా వెంత చెప్పినా వెంటానే ఎలా నమ్ముతున్నావు నెనేంటి నీకు తెలీదా..
నే నీసమయం లో రాత్రుల్లు నిద్రలేకుండా నీకోసమే ఆలోచిస్తుంటాను అని తెల్సు కాని నీకస్సలు పట్టదు..
కాని ఒక్కటి మాత్రం నిజం నిజంతెల్సుకొంటావు ఏరోజుకైనా ...
ఆరోజు నాకోసం వెతుకుతావు కచ్చితంగా నీకు నేను కనిపించను..
ఆకాశంకేసి చుస్తే అక్కడ మెరుస్తున్న చుక్కలా నీకోసం ఎదురు చూస్తాను తెలుసా
Labels:
కవితలు