Thursday, September 27, 2012
కనికరం లేని నీ రాతి గుండెను కరించలేక
నీకోసం ఈ ఆవేశం..
నీవెక్కడా అంటూమదన పడుతున్న మనస్సు
నీవు దూరం అయ్యావన్న ఆందోళన
ఎన్నాళ్ళు ..ఇక మనం ఎప్పటికి కలవలేమా
ఎదురుచూసి అలసి సొలసి సొమ్మసిల్లిన
మనస్సు ప్రియా నాది..
మరువరాని మరపురాని క్షణాలను
తలచి తలచి దుఖిస్తూ
నిర్జీవమైన దేహంతో
అంతులేని అనంతమైన
శూన్యంలో రెప్పపాటు
దుఖంతో
మూలుగుతూ మ్రుక్కుతూ
నీకోసం ఆలోచిస్తూ అన్వేషిస్తూ
నిరీక్షిస్తూ నిట్టుర్పు విడుస్తూ
భాధతో వ్యధతో నీకోసం.
తిరిగిరాని నా గతన్ని తలచుకొని
తలచిన తలపులు దూరంకాగా
మరపురాని మదురగానంలో
స్వరం తప్పిన గీతంలా
విషాద గీతం ఆలపిస్తూ
కన్నీల్లలో కాలాన్ని కరిగించుకొంటూ
కనికరం లేని నీ రాతి గుండెను కరించలేక
కాలి పోతున్న కాష్టంలా ....మిగిలిపోయాను ప్రియా ఇలా
ఒక్కసారిగా వెలుగు వెలిగి మిగిలిన బూడిదలాంటీ ప్రస్తుతం