Monday, September 24, 2012
ఎంచేస్తున్నావో అంటూ గుర్తుకు వస్తావు..I am In Love
ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు
ఎంచేస్తున్నావో అంటూ గుర్తుకు వస్తావు..
నలుగురితో మాట్లాడుతున్నప్పుడు..
నీలాగా కనిపిస్తే ఎక్కడున్నావో అని గుర్తుకు వస్తావు.
గతంతాలూక గుర్తులతో ఒక్కోసారి మనస్సు దిగులుగా మారుతుంది
అలాంటప్పుడు ఎవ్వరు పలుకరించినా మాటలు రావు...
ఎమైందని అడీగితే ఏమని చెప్పను.
జరుగుతోంది వాస్తవమా...జరిగిపోయింది వాస్తవమా అని అనిపిస్తోంది ఎందుకో ఏది నిజమో ఏది అబద్దమో అర్దంకాని పరిస్థితి...
ఎంజరుగుతుందో తెలియట్లా..
ఒక్కసారిగా మారుతున్న పరిస్థితులు
ఎందుకిలా జరుగుతుందో తెలియదు..
కారనాలేంటో తెలియక అన్నిటికీ కన్నీళ్ళే సమాదానం చెబుతోంది...
నా కన్నీళ్ళ సమాదానం నాకర్దకావడంలేదు..ఆ మూగభాషఏంటో
నా కన్నీళ్ళకు నేను సమాదానం చెప్పుకోలేని పరిస్థితి..