Saturday, September 22, 2012
గుండె పగిలింది.. ప్రపంచం బద్దలైదన్నట్టుగా ఉంది
నీవు నేను నుంచి మనంగా కలిసాము
మర్చిపోలేని జ్ఞాపకాలెన్నో పంచుకున్నాము
మదిపులకించిన వేల ...
ఒకరికి ఒకరం ఏకం అవ్వలని కలలుకన్నాం
నీపేరు తల్చుకుంటే నామది జివ్వుమనే ఆనందం
నీ SMS వచ్చినా నీ ఫోన్ వచ్చినా
ప్రపంచాన్ని జయించానన్న ఆనందం
అప్పుడు జీవితం చిన్నదనిపించింది
లోకం కొత్తగా ..గమ్మతుగా అగుపించింది
నీ పెదవుల మీద మెరిసిన దరహాసం
నన్ను వివశుడిని చేసింది
కలకాలం ఇలాగే ఉంటుందని అనుకునే లోపే
మన మధ్యన ఎడతెగని ఎడబాటు..
నన్ను దూరం చేశావు.. ఎవరికోసం మనసు కష్టపెట్టావు
అర్దం చేసుకునే లోపు..
నీవు నా పరుదుల గురించి చెప్పావు.. నీవేంటి నాతో
స్నేహం ఏంటీ. ప్రేమ ఏంటి అని వెటకారంగా
మనస్సు భాదపడేల SMS పంపావు
గుండె పగిలింది.. ప్రపంచం బద్దలైదన్నట్టుగా ఉంది
నీవు కాదేమో ఆ sms పంపింది అని
కోటి సార్లు చూసుకున్నా నా ఫొన్ ఆత్రంగా తడుముకున్నా
నా పిచ్చిగాని ఒక్కసారి నిజం అబద్దంగా మారదుకదా..
మనస్సగా బ్లాంక్ గా మారింది..చీకట్లు కమ్ముకున్నాయి
నా మీద కూడా పూలు చల్లుతున్నారు
నేను శవ పేటిక మీద ఉన్నా...
నీ ఇంటిమీదగా నా శవపేటిక పోతుంటే నీవు ఎవరితొనో హేపీగా
ఫొన్లో మాట్లాదుతున్నావు..
నేను ఏమయ్యాని తెల్సుకోలేనంతగా..
అవును కదా ఇదేనా స్నేహం అంటే ప్రేమ అంటే..
అందరూ ఒకే లా బిహేవ్ చేస్తారు
నీవు ప్రత్యెకం అనుకున్న కాని అందరిలాగే నీవు