Friday, September 14, 2012
కాటుక కన్నుల వాలు చూపుల్లో చిక్కుకున్నా ఎప్పుడో
ప్రియా తడి ఆరని ముంగురుల జల జలా జారు
నీటి బిందువులు ముత్యాల వలె
మోముపై మురిపెముగా చేరి
నెమ్మదిగా జారి మయమవ్వగా ,
ప్రియా కాటుక కన్నుల వాలు చూపుల్లో చిక్కుకున్నా ఎప్పుడో
సోయగాల దాటిని బిందువులు కొన్ని ,
మెరిసే నుదుటన వడివడిగా
ప్రియా ఆధారాల జాలువారే బిందువులు కొన్ని,
నును బుగ్గల సిగ్గులు తాకి మురిసి
ఆవిరి అవ్వాలనుకునే బిందువులు కొన్ని ,
ఆధారాల వోమ్పులలో ఆగి అవిరవ్వాలని
ప్రియా ఆశపడే పడే బిందువులు కొన్ని ,
అన్నీ కలసి నిన్ను ప్రేమగా తాకుతుంటే ,
అర విరిసిన కన్నులతో నా ముందర నిలిచి
విరిసీ విరియని చిరునవ్వులు విసిరితే
ప్రియా నిన్ను తాకి ధన్యమైన బిందువులను చూసి
నా మనసు రగిలిపోతున్నది ప్రియతమా !!
అలక తీర్చు భారము మాత్రము నీదే ప్రియా!!
Labels:
కవితలు