
నా గుండె గదిలో ఏ మూలో
ప్రతిక్షనం తచ్చాడుతూనే ఉంటావు
మనసా వెలుగులు నింపుతూనే వుంటావు
నీ ఆలోచనలు నన్ను గిలిగింతలు పెడుతూనే ఉంటాయి
నీ వాలు చూపుల్లో చిక్కుక పోయిన నేను
నన్ను నీకు బందీగా మార్చాను ఏమారి పోయాను
మనసు తలుపులు తెరిచి నిన్ను
పంపించలేను..మది అంధకారం చేసుకోలేను
ఏకాంతంలో నిన్ను తలచి మైమరచిపోతుంటాను
నీతో ముచ్చట్లు చెపుతూంటాను
నీవు నా ఎదురుగా లేకపోయినా
నీవు పిచ్చి అనుకున్నా ఎవరు ఏమనుకున్నా
నాలో ఎప్పటికీ ఆరని జ్యోతివి నువ్వు
మది నిండిన జ్ఞాపకాల హారతి నువ్వు
అందుకేనేమో నా ఆత్మీయ నేస్తమా…..
నిన్ను గుండె గదిలో ఓ మూల బంధించాను!
నువ్వెప్పటికీ నాలోనే వుంటావుకదా... అప్పుడు
ప్రేమజ్యోతివై వెలుగులు నింపుతావో
ఆరని అగ్నికీలవై మదిని దహిస్తావో నీ ఇష్టం మనసా
waiting For You..My Dear......?