Sunday, September 2, 2012
మౌనంగా మైనంగా కరిగిపోదామని నిర్నయించుకున్నా ప్రియా
మౌనంగా మైనంగా కరిగిపోదామని నిర్నయించుకున్నా ప్రియా..
కొవ్వొత్తి వెలుగుతుది అని మాత్రం చూస్తాం
కాని అది తాను వెలుగుతూ కరుగుతున్న విషయాన్ని పట్టించుకోం..
ఎందుకంటే ఆ కొవ్వొత్తి అయిపోతే మరోకటి కోంటాం కదా..?
మరి ఇప్పుడు మనుషుల మద్యి స్నేహం , ప్రేమ కూడ అలా గే అయింది
నీజాయితి నిఘార్సైన ప్రేమ ఎవ్వరికి అక్కరలేదు..?
అలా చూపించే ప్రేమకు అనేకర్దాలు ..పెడతారు..?
అసలు ప్రేమ అని చెప్పి ఆప్రేమని అపహాస్యిం చేస్తున్నావని..
ఏవరికోసమో మనల్ని అవమానిస్తారు మనం భాద పాతాం అని తెల్సి కూడా
మనమేమో వాళ్ళు ఎప్పటికీ భాదపడ కూడదని
తన జ్ఞాపకాలను మదిలో బద్రంగా పెట్టుకొని...
గుర్తొచ్చిన ప్రతి సారి మూగగా రోదిస్తూ ఉంటే..
ఆరోదన వారికి తెల్సికూడా .. చిరాకు పడతారు..
అందుకే గాబోలు మనసు బాదలో చనిపోవలని ఉంది అంటే
అంటే సిగ్గుగా లేదా అని అన్నావు...
ఆమాట ఇంకా గుండేల్లో బాంబులా పేలుతూనే ఉంది ప్రియా..
ఎప్పుడు మాట్లాడదామా అని నేనుంటే ..నాకు మాట్లాడాలని లేదన్నావు
అప్పుడలా ఇప్పుడిలా ఎందుకు మారావు ప్రియా
అందుకే నాకు నేను మౌనమనే సంకెళ్ళు వేసుకుంటున్నా..
నాకు వల్లకాదు కాని నీకోసం తపించే ఆ మనసుకు
బలవతంగా గొలుసులతో కట్టే ప్రయత్నం చేస్తున్నా ఇది నా వల్ల అయ్యే పని కాదు...
కాని నీసంతోషం కోసం నాకు తప్పదు ప్రియా ....
నేను మాట్లాడకపోతే.. నేను దూరం అయితే సంతోషంగా ఉంటాను అంటే ..
నాకు కావాల్సింది నీసంతోషం దానికోసమే ..
ప్రియా నీచూపుకందనంత దూరం
ప్రియా నీ పిలుపు వినపడనంత దూరం
కంటికేగాదు ఎప్పుడన్నా నీవు వెతికినా కానరాని దూరం పోతున్నా త్వరలో ప్రియా