. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, September 19, 2012

ప్రియా"..ఏమైందో ఏమో


ప్రియా"..ఏమైందో ఏమో
ఉన్నట్టుండి ఆ చెమ్మగిల్లిన కళ్ళు
అగుపించటం లేదు
ప్రేమ నిండిన ఆ అందమైన కళ్ళు
లోగిల్లై ..వాకిల్లుగా మారి పోయిన చోట
దేని కోసమో వెదుకుతున్నట్టు
ప్రియా ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్టు
అలుపు సొలుపు లేకుండా
వెంబడించినట్టు అనిపించింది
అయినా మనకు తెలియకుండా
మనల్ని మరొకరు చూడటం ఎంత బావుంటుందో
ప్రియా అదో స్మరనీయమైన సన్నివేశం
అదో మోహావేశపు ఆలింగనం
మనం అనుకుంటాము కానీ
కొన్ని వేల కళ్ళు
ప్రియా మనల్ని నిశితంగా గమనిస్తుంటాయి
గుండెలను గుచ్చుకునేలా చేస్తూనే ఉంటాయి
నడిచినా ..సంచారం చేసినా
ప్రియా లోకాన్ని స్పృశించినా
నిదురలోకి జారుకున్నా
ఆ కళ్ళు మాత్రం కలలో కూడా
కమ్మని కబుర్లు చెబుతాయి
హృదయపు సముద్రం మీద
ప్రియా అలల సంతాలు చేస్తాయి
గోదావరిగా మారిన
గుండెల మీద వాలిపోతాయి
మరిచిపోని సంతకాలు చేస్తాయి ప్రియా