Sunday, September 2, 2012
ప్రియా గుండెలో కత్తిలా గుచ్చుకునే నీ మౌనాన్ని తల్చుకుని
ప్రియా నీ బదులు నాకు తోడుగా నువ్వు పంపిన ఈ ఒంటరి తనం అంటే ఎంతో ఇష్టం ఒంటరిగా నీ ఆలోచనల్లో కాలాన్ని గడిపేయటం ఇష్టం
ప్రియా ఒంటరిగా నా మాటలకి సమదానంగా నువ్వు నవ్వే నవ్వుని
గుర్తు తెచ్చుకోవటం ఇష్టం
ప్రియా ఒంటరిగా నా ప్రశ్నలకి దాటవేసే నీ మాటల్ని తల్చుకుని నవ్వుకోవటం ఇష్టం ఒంటరిగా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావా అని నీ రూపాన్ని ఊహించుకోవటం ఇష్టం
ప్రియా ఒంటరిగా గుండెలో కత్తిలా గుచ్చుకునే నీ మౌనాన్ని తల్చుకుని
బాధ పడటం కూడా ఇష్టమే
ప్రియా ఒంటరిగా నిన్ను తల్చుకుని మూగ గా రోదించటం అంటే కూడా ఎంతో ఎంతో ఇష్టం..చెప్పలేనంత ఇష్టం
ప్రియా నీవిక రావని నాతో మాట్లాడవని తలపులు వచ్చిన క్షనమే .. నేనిక ఎందుకు బ్రతకాలో అంటూ మనస్సు నన్ను అసహ్యించుకొంటూంది
Labels:
కవితలు