Thursday, September 27, 2012
నిన్ను చూశాను చాలా దగ్గరగా చూశాను
నిన్ను చూశాను చాలా దగ్గరగా చూశాను .... అవేకళ్ళలో మెరుపులు ..పెదవిపై చిరునవ్వు....నిన్ను చూడగానా ఒక్కాసారిగా ఉప్పొంగిన ఉద్వేగం.. ఆపుకోలేకపోయాను .. చాలా దగ్గరగా చూసి ఎన్ని రోజులైందొ తెలిది.. మనషులం దూరం అయ్యాం మనసులు కూడా దూరం అయ్యాయి నీకు గుర్తుందా రెందు సంత్స్రరాలక్రితం ఇదే నెలలో మన పరిచయం. ఒకప్పుడు చాలా దగ్గరగా ఒకరికోసం ఒకరం అన్నట్టు ఉన్న మనం.. ఇలా ఎవరికెవరు తెలియనట్టు ఉండటం నాకు చాలా భాదగా ఉంది.. అంతకు మించి ఏం చేయలేం కదా..?...నీ దగ్గరకు వద్దాం అనుకున్నా ...ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలీక తడబడ్డా.. ఎందుకు మళ్ళీ నిన్ను భాదపెట్టాలి.. ఇప్పటికీ నన్ను మర్చిపోయి హేపీ గా ఉన్న నిన్ను .. నీ పెదవిపైనిలచి ఉన్న చిరునవ్వు నేనెందుకు చెరిపేందుకు కారణం అవ్వాలి..జరుగుతున్న ప్రతిఘటన ఎదురు తిరుగుతోంది అందుకే మౌనంగా ఉండాలని నిర్నయం ...ఇష్టం మైన వాల్లని ఎందుకు ఇబ్బంది పెట్టాలి నీవుమారలేదు అప్పుడు ఎలా ఉన్నావొ ఇప్పుడు అలాగే ఉన్నావు.. ఒకప్పుడు దగ్గరగా భాదలు సంతోషం పంచుకున్న మనం ఇప్పుడెందుకిలా దూరంగా..ఏంటో కదా జీవితం.. ఆలోచిస్తే అంతా గందరగోళంగా ఉంది.. ఆలోచనే మనసులో గుబులు రేపుతుంది... అందరూ అంతే ఉన్నారు .. గజిబిజి గా ఉంది ఎందుకో ఈరోజు నిన్ను దగ్గరగా చూశను అన్న ఆనందమో కనీసం చిన్న పలుకరింపు లేకుండా తిరిగి వచ్చానన్న భాదో తెలీదు.. అర్దం కావడం లేదు