Wednesday, September 26, 2012
నాకు తోడుగా నువ్వు పంపిన ఈ ఒంటరి తనం అంటే ఎంతో ఇష్టం
నీ బదులు నాకు తోడుగా నువ్వు పంపిన ఈ ఒంటరి తనం అంటే ఎంతో ఇష్టం
ఒంటరిగా నీ ఆలోచనల్లో కాలాన్ని గడిపేయటం ఇష్టం
ఒంటరిగా నా మాటలకి సమదానంగా నువ్వు నవ్వే నవ్వుని
గుర్తు తెచ్చుకోవటం ఇష్టం
ఒంటరిగా నా ప్రశ్నలకి దాటవేసే నీ మాటల్ని తల్చుకుని నవ్వుకోవటం
ఇష్టం ఒంటరిగా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావా అని నీ రూపాన్ని
ఊహించుకోవటం ఇష్టం
ఒంటరిగా గుండెలో కత్తిలా గుచ్చుకునే నీ మౌనాన్ని తల్చుకుని
బాధ పడటం కూడా ఇష్టమే
బరించలేని భాదని మిగిల్చి...మౌనంగా ఎంజాయ్ చేతున్నావు..
నీ స్నేహితులతో నాకు అదీ ఇష్టమే .,...
నీవు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నవ్వుతుండాలి
ఒంటరిగా నిన్ను తల్చుకుని
మూగ గా రోదించటం అంటే కూడా ఎంతో ఎంతో ఇష్టం చెప్పలేనంత ఇష్టం .
నేను ఎప్పుడూ భాదపడాలని కోరుకుంటావు కదా.
అందుకే నన్ను అవమానించి నన్ను
ఓ తప్పుడు మనిషిగా చేసి మౌనంలో ఒదిగిపోయావు ప్రియా..
తప్పంతా నామీద నెట్టివేసి..
నన్నోదోషిని చేశావు నీ స్నేహితుల్లో నేనొక్కడినే దోషిని కదా.నీ
వేంచేసినా ఇష్టమే బుజ్జీ