నీ తో మాట్లాడలనుకునే మాటలని గుండెల్లోనే అదిమిపెడుతుంటే
కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్నే అభిషేకిస్తున్నాయి
ఎందుకో నీ కోసం కన్నీరు కార్చినా ఆనందంగానే ఉంది
ఎందుకంటే నీ మనసుని తాకలేని నా మాటలు
కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్ని తాకుతున్నందుకు
నక్షత్రాల మెరుపుని చూసి
మురిసి పోయావు కానీ
నా మనసే విరబూసిన వెన్నెలైనా
నీ కోసమే అని తెలుసుకోలేక పోయావ్
అయినా ఇది నీ తప్పు కాదులే
నేను నీ మహల్లో కోయిల నే కానీ
నీ నిశీధి గుండెను చేరే
తీయని గానం చేయలేక పోయానేమో