Friday, September 14, 2012
నీవు నాపేరు తలస్తుంటే నీపై " నా మనస్సు విరిగింది అంది "
ఓ నలిగిన జ్ఞాపకం
ఓ నలిగిన కాగితం
అప్రయత్నంగా జారి పడింది....
వీలైనంత చదును చేసి చదువుదామంటే
కన్నీళ్ళ కొలనులైన కళ్ళు
మసగబారిపోయాయి.....
ఒక చేత్తో కళ్ళు నలుపుకుంటూ
మరో చేతి చూపుడు వేలుతో
అలుక్కుపోయిన అక్షరాలు విడదీస్తుంటే
చెమ్మగిల్లిన కాగితం
మరి కాస్త చిరిగి
మనసుని చిత్తడి చేసింది...
మనసును మాయసేసింది ..
ప్రేమిస్తున్నా అని చెప్పి..నేమాట అన్నాన్నా అంది
స్నేహం పేరుతో ప్రేమను అపహాస్యిం చేస్తున్నా అంది
నా పేరు పదే పదే తలవద్దని వార్నిగ్ ఇచ్చింది
నా పేరు తలస్తుంటే నీపై " నా మనస్సు విరిగింది అంది "
ఒకప్పుడు మనుషులు ఆంటే భయం..
ఆమె ఇచ్చిన వార్నింతో మనసులు అన్నా భయమేస్తుంది
ఒకప్పుడు మనిషిలా బ్రతికా ఇప్పుడు జీవచ్చవంలా జీవిస్తున్నా
అందుకేనేమో ఒక్కోసారి ,...నా దగ్గర చచ్చిన శవం వాసన వేస్తుంది
అంటే నేను ఎప్పుడో చచ్చిపోయాను బ్రతికున్న శవాన్ని నేను మనసా
Labels:
కవితలు