Sunday, September 2, 2012
నాది ప్రేమో పిచ్చి నాకు తెలియదు ..ప్రియా
ప్రియా ప్రేమలో రవ్వంత పిచ్చి ఉంటదంటా అని ఎక్కడో చదివా
మరి నాది ప్రేమో పిచ్చి నాకు తెలియదు కాని
అది చిదివినాక వాళ్ళందరూ అన్నది నిజమేనేమో అని నాకు కూడా అనిపిస్తుంది
రవ్వంతే కాదు నయం చేయలేనంత పిచ్చి నువ్వంటే
ప్రియా ఎందుకో కారణం తెలియదు, ఎలా పుట్టిందో తెలియదు
ఎప్పుడు మొదలయిందో తెలియదు, కాల గమనంలో తగ్గిపోతుందని అనుకున్నానే
ప్రియా కాని ఆ కాలంతో పోటీగా నా ఆలోచనలు కూడా నీ వెంటే పరుగెత్తి
నన్ను పిచ్చి వాన్ని చేస్తాయనుకోలేదు
ప్రియా ఆ క్షణం నుండి ఈ క్షణం వరకూ కూడా పిచ్చివాన్నిలా
నీ గుంరిచే ఆలోచిస్తూ ఉంటానని అస్సలు ఊహించలేదు
ప్రియా ఏ బందం లేని నీ ఊహల అనుబంధంలో చిక్కుకుని
నా పిచ్చి మనసు ఎంత చెప్పినా వినకుండా
ఈ రోజు కాకపోయినా ఏ రోజుకయినా నా నీరీక్షణ ఫలించకపోతుందా అని
ఇలా నీ రాకకై ఎదురుచూస్తున్నాను ఆశగా పిచ్చి వానిలా
Labels:
కవితలు