Sunday, September 16, 2012
మన మద్యి .. మౌనమనే మైనపు గోడలు కట్టావు .
మనసు మలయ మారుతమై నీకోసం ఎదురు చూస్తున్నప్పుడు
నన్ను నేను మర్చిపోయి నీకోసం ఎదురు చూస్తుంటే..
మనస్సును కాదని..ఏమార్చి నన్ను మర్చి వెళ్ళిపోయావా ప్రియా
వలపుల వసంతాలు పూయించాల్సిన నీవే .
నన్ను కాదన వదలి వెళ్ళావు.. బాగున్నావా ప్రియా..
నా ప్రేమకోస
ం ఎదురు చూస్తావని తెల్సు..,
కాని మన మద్యి ..
మౌనమనే మైనపు గోడలు కట్టావు ..
అవి ఎప్పుడు కరగాలి
మనం ఎప్పుడు కరగాలి ప్రియా..
నాలాగే నీవు ఎదురు చూస్తున్నా వని తెల్సు
నీవేంటో నీ మనసేంటో తెల్సిన నేను..
నీవు పూయించే వలపుల వసంతంకోసం వేయిజన్మలైనా ఎదురు చూస్తాను
నీమీద నాప్రేమ మీద నమ్మకం ఇప్పుడు కాకపోతే మరోజన్మకైన చేచి చూస్తూనే ఉంటా...నా ప్రేమను కదాన్నావు. నాలో ఉన్న ప్రేమను కదిలించలేవు
నీ పై ఉన్న ఇష్టాన్ని చెరపలేవు అది నీవల్ల కాదు
నీగుండేళ్ళో కూడా నేనే ఉన్నాకదా...ఉన్నా అని చెప్పవూ
చెప్పేందుకు నీకు మనస్సు రావడం లేదుకదా..
ప్రియా నీ మనస్సాక్షిని చంపుకొని ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావో
నన్ను ఇలా ఎన్ని రోజులు మౌనంతో ఏడీపిస్తావో నేనూ చూస్తా మౌనంగా
నీ తీయని పిలుపుకోసం చకోర పక్షిలా.. కనురెప్పవేయకుండా ప్రియా..
Labels:
కవితలు