Saturday, September 22, 2012
ప్రేమా మమ్మల్ని ఎందుకు విడదీశావు
ప్రేమా మమ్మల్ని ఎందుకు విడదీశావు
తనేం తప్పు చేసింది ....నేనేం తప్పు చేశాను
ఇద్దర్నీ కారణాలంటూ విడతీసి ఏంసాదిస్తావు
తనకొసం నేను కట్టుకున్న ఊహల కట్టడాలను కూల్చావు
నాకోసం తను నమ్మిన ఊహల పల్లకీనీ కూల్చావు
ఎన్నో మనసుల్ని కలిపిన ప్రేమా మామీద ఎంద
ుకు పగ తీర్చుకుంటున్నావు..
తనకోసం కన్న కలల అలలకు వల వేయించి కడలి అలలకు నన్ను బలి అయ్యేలా ఎందుకు చేశావు ప్రేమా
ఆ జాబిలమ్మ అమాయకురాలు. . అందర్నీ నమ్ముతుంది..
నిజమేదో అబ్ద్దద్దం ఏదో తెలీద్... తనను నాకు దూరం చేయకు ప్లీజ్
..తొలివలపుల తలపులతో అడుగులేసున్న నన్ను
తనతో దూషించేలా చేశావ్ ఎందుకలా ప్రేమా
తన జ్ఞాపకాలు తలచుకొంటూ ఇలా వంటరిగా ఎన్నాళ్ళు ఉండాలి
.తన చిరునవ్వుల సవ్వడిలో నన్ను ఊరడించేరోజొస్తుందా
జ్ఞాపకాల మూటలు కట్టుకొని ఎదురు చూస్తున్నా
ఎప్పటికైనా రాకపోతుందా అని