Sunday, September 23, 2012
నీకోసం రాసుకున్న Blog డైరీ పేజీలు చూడు బుజ్జీ
ఎక్కడున్నవ్ బుజ్జీ
మనసు తలుపులు తట్టి
తలపుల తలుపులు తీయింది
ఎక్కడికెళ్ళావు బుజ్జీ
మది నాదన్నావు
మరువను ఎప్పటికీ అన్నావు
మరి నన్ను వీడి ఎక్కడికీ పోయావు బుజ్జీ
చీకట్లో ఉన్నది చూసి
నామనస్సు చీకటి అనుకున్నావా
వెలుతురులో వెన్నేల కురిపించలేననా
పైపై మెరుగులు చూస్తున్నావ్
నాలో నిండి ఉన్న ప్రేమను చూడు
నీకోసం రాసుకున్న Blog డైరీ పేజీలు చూడు బుజ్జీ
ప్రతి అక్షరంలో నీవే
పరుగులు తీసే ప్రతి పదంలో నీవే
నేను మారలేదు బుజ్జీ నీవెందుకు మారావు
"కలల ప్రపంచంలో " పడి మర్ఫిపోయావా బుజ్జీ
"వెన్నెల వెలుగులు "నిజమని నన్ను మర్చావా బుజ్జీ
బరించలేని భాదను నాకొదిలి ఎల నవ్వుతున్నావు బుజ్జీ
నీకు ఏదైనా సాద్యిమే బుజ్జీ
నవ్వించగలవు, కవ్వించగలచు,ఏడ్పించనూ గలవు
ఇన్నీ చేసి ఏం ఎరుగనట్టూ ఉండగలవు బుజ్జీ
కాని నీమీద నమ్మకం వస్తావని
నన్నోదారుస్తావని...ఊరడిస్తావని
బుజ్జీ ఇది నమ్మకమా గుడ్డి నమ్మకమా నీవే తేల్చాలి