Friday, September 21, 2012
నీవు పంపిన SMS లు చూసి గుండె పగిలింది ..
ఏమని బదులివ్వను ప్రియతమా....... ??
సముద్ర తీరాన న ఒంటరి పయనం
అసలు నీవు నా జీవితంలో ఎందుకు ప్రవేశించావు
రావడం నీ ఇష్టమే పోవడం నీ ఇష్టమే..
ఎందుకు నాజీవితం నుంచి అకారనంగా వెళ్ళిపోయావు..
అందుకే తాకే ప్రతి అల నీజ్ఞాపకం
నా కాలను తడిమి నిన్ను గుర్తుచేస్తూ ఉంటే
నా ఒంటరి తనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే
ఏమని బదులివ్వను ప్రియతమ........ ??
వీచే చిరుగాలి న మేను ని తడుముతూ ఉంటే
.ప్రతిక్షనం నిన్నే గుర్తుకుతెస్తుంటే.. ఏమని చెప్పుకోను
ని తోడు ఏది అని ప్రస్నిస్తుంటే
ఏమని బదులివ్వను ప్రియతమ...... ??
నాకు ద్రోహం చేసి మనసును భాదపెట్టి
అనరాని మాటలు అని .. దూరం అయిందని ఎలా చెప్పను
నీవు అలా అనవు కాని అన్నావు
ఎవరో నీమనస్సులో చేరారు అందుకే నేను చేదయ్యాను
నన్నో తప్పుడుమనిషిగా చేసి .అలా ఎలా అనగలిగావు ప్రియతమా
నా పరిది దాటానా.. నిన్ను భాదపెట్టానా
నీ చుట్టూ ఉంది వెదవలు .. అది తెల్సి కంగారు పడ్డా
నిజం ఇప్పుడు తెలీదు.. తెల్సినప్పుడు నీకు కనిపించను
ఎక్కడ వెతికినా .. అప్పుడు తెలుస్తుంది నా విలువ
ఎంత తప్పు చేశానా అని..ఆరోజు తొందర్లోనే ఉందిలే
నన్ను బాగా అర్దం చేసుకొని నేనేంటో తెల్సిన నీవే
ఇలా ఎలా చేయగాలిగావు...
నీవు చాలా మారిపోయావు ప్రియతమా
నీవిలా అంటావని ,..ఇలా మారిపోతావని కలలోకూడా ఊహించలేదు
అంత ఇష్టం నీవంటే .. అంత నమ్మకం నీవంటే...
నీవు పంపిన SMS లు చూసి గుండె పగిలింది ..
మాట మొద్దుబారిపోయింది..
ఈ SMS చూడటానికా నేనుబ్రతికుంది అని భాదవేసింది..
జరిగినదంతా అబద్దం అయితే బాగుండు అని
ఇంకా నా మనస్సు నన్ను మబ్యి పెడుతుంది అంటే
నామనస్సు ఇంకా జరిగింది ఓ కలే అని నమ్ముతోంది పిచ్చిది
నేను వేసే ప్రతి అడ్గు
తన తోడును వెతుకుతూ ఉంటే
నా తోడు ఏది అని ప్రస్నిస్తుంటే
ఏమని బదులివ్వను ప్రియతమ....... ??
మౌనంగా తల వొంచాను వాటి ప్రశ్నలకి
సమాధానం చెప్పలేక ఇక ఎప్పటికీ చెప్పలేనేమో
అలలా వచ్చావు కలగా మిగిలి కన్నీరు నాకిచ్చి
నీదారి చూసుకున్నావా.. ప్రియతమా
నీవు హేపీగా ఉంటే నాకదే చాలు ప్రియతమా