ఇదిగో వినిపిస్తున్నా చివరి సందేశం
శ్మశానం నుంచి నా ఆకరు స్థానం నుంచి
శవాన్నై మృత కలేబరాన్నై
దివంగతునై దిగంబరునై
నిచ్చేస్టునై నిత్తేజునై
నిచ్వాస ఉచ్వాస లకు అతీతునై
నిగామార్థ మోక్షానికి అనర్హునై
ఏది నా శవము ఏది నా యవ్వనము
ఏది నా కౌమారము ఏది నా వృద్దాప్యము
దేనిని తనివితీరా తాకనేలేదు
ఏది నా భోగము ఏది నా సౌక్యము
ఒక్కరైన నావెంట నడవనేలేదు
ఏది నా స్వార్థము ఏది నా మోహము
ఏది నా లోభము ఏది నా శోకము
ఇంకిప్పుడు కనుచూపు
మేరనైన కానరానేలేదు
గెలుపోటములింకా తేలనేలేదు
ఆశల మడుగులో అణువణువునా
మునిగి విసిగి వేసారిన
నాకింకా ఓదార్పు అందనేలేదు
ఆశయాల కొలిమిలో నిలువునా రగిలిన నాకోసం
ఒక్క ఆసృవైనా నేలరాలనేలేదు
నిరాశతో నిసృహతో సాగిన ప్రయాణం శ్మశానందాకా
నడిదారిన ఆడంబరాలు మోసి మోసి అలసి సొలసి
చితి పాన్పుపై పవలించినాకా
ఇంకెందుకు ఆక్రందన ఇంకెందుకు ఆవేదన
ఇంకెందుకు గతస్మృతులు ఇంకెందుకు నా అన్నవారి వ్యధలు
ఇంకాసేపట్లో చితిమంటల అభిషేకానికి సన్నద్దమవుతూ
చిత్రంగా వినిపిస్తున్నానెందుకు చివరి సందేశం
శ్మశానం నుంచి నా ఆకరు స్థానం నుంచి
శవాన్నై మృత కలేబరాన్నై
దివంగతునై దిగంబరునై
నిచ్చేస్టునై నిత్తేజునై
నిచ్వాస ఉచ్వాస లకు అతీతునై
నిగామార్థ మోక్షానికి అనర్హునై
ఏది నా శవము ఏది నా యవ్వనము
ఏది నా కౌమారము ఏది నా వృద్దాప్యము
దేనిని తనివితీరా తాకనేలేదు
ఏది నా భోగము ఏది నా సౌక్యము
ఒక్కరైన నావెంట నడవనేలేదు
ఏది నా స్వార్థము ఏది నా మోహము
ఏది నా లోభము ఏది నా శోకము
ఇంకిప్పుడు కనుచూపు
మేరనైన కానరానేలేదు
గెలుపోటములింకా తేలనేలేదు
ఆశల మడుగులో అణువణువునా
మునిగి విసిగి వేసారిన
నాకింకా ఓదార్పు అందనేలేదు
ఆశయాల కొలిమిలో నిలువునా రగిలిన నాకోసం
ఒక్క ఆసృవైనా నేలరాలనేలేదు
నిరాశతో నిసృహతో సాగిన ప్రయాణం శ్మశానందాకా
నడిదారిన ఆడంబరాలు మోసి మోసి అలసి సొలసి
చితి పాన్పుపై పవలించినాకా
ఇంకెందుకు ఆక్రందన ఇంకెందుకు ఆవేదన
ఇంకెందుకు గతస్మృతులు ఇంకెందుకు నా అన్నవారి వ్యధలు
ఇంకాసేపట్లో చితిమంటల అభిషేకానికి సన్నద్దమవుతూ
చిత్రంగా వినిపిస్తున్నానెందుకు చివరి సందేశం