. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, August 26, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(19)

1) రెప్పల మధ్య మూసుకుని దాచుకున్న స్వప్నాల్ని
ఒక్కసారి చూడవూ..చూడవని తెలిసీ..చూడలేవనీ తెల్సి ఎందుకీ ఆరాటం


2) మెత్తని అడుగుల నిస్సబ్ధపు హోరులో
నీకు వినిపిస్తుందా నా గుండె చప్పుడు ఘోష


3) అపార్ధాల లోయల్లోకి జారి పోయిన నిజాలు
అర్దంచేసుకోలేని మనసులమద్యి చేజారిపోతున్న జ్ఞాపకాలు


4) హృదయాల మధ్య పడ్డ చిల్లులతో వెలితిగా ఉంది
ప్లీజ్ ఓ కళ్ళమందు జరిగిన నిజం అబద్దం అవ్వలంటే ఏం చేయాలొ


5) అపజయం ఒకదాని తరువాత మరొకటి
నిస్సహాయస్థితిలో చేజారిన క్షనాలు తరువాత తరువాత వచ్చే మరణం


6) ఎందుకో ఎప్పుడూ ఆకాశము నేను ఒంటరిగా మిగిలిపోతాం
వెళ్ళిపోయిన నువ్వు ఇక మరి రానే రావు అని తెల్సి నీకోసం ఎదుచూస్తూ


7) నా కనుపాపలు నీ స్వప్నాలను జారిపోకుండా కాపలా కాస్తుంటాయి
వెన్నెల్లో విరజాజి మెరుస్తుందికాని ఎందుకో వాడిపోయి నన్ను వీడిపోతోంది


8) నా ఉనికిని గుండె గా మార్చి సడి నీకు వినిపించాలని చూస్తున్నా
నిన్ను చేరే ఘడియల కోసం నా ఉపిరి దారంతో కాలాన్ని కొలుస్తున్నాను నిజం తెల్సి కూడా


9) దాటలేని లోయల మధ్య తెంచు కోలేని బంధాల
మధ్య బందీనై ప్రతీ క్షణం ఆక్రోశిస్తుంటాను ఎక్కడో నువ్వున్నవనే వెర్రి ఆశతో


10) నూరేళ్ళూ నిలిచే స్నేహ౦ కావాలి..కన్నుల్లో నన్ను దాచే నేస్త౦ కావాలి
గు౦డెలో ఒదిగిపోయే౦దుకు ప్రేయసి కావాలి ఇన్ని అబద్దాలు ఎలా నిజం అవ్వాలి..


11) కను రెప్ప వెనకాల ఉబికిన కన్నీరు నిలబడనంటుంది
నీ మౌనంతో పదునెక్కిన కత్తిలా కస్సున గుండెల్లో దిగి పూడ్చలేని గాయం చేసింది


12) నీ జ్ఞాపకాల వల నన్నూ నాతో పెనవేసుకుపోయిన
మన అనుబంధాన్నీ మరొకసారి గుర్తుచేస్తూ బరువుగా భూమిలోకి కూరకపోయింది


13) నిత్యం నలుగుతున్న బతుకు నిజాల మధ్య
నలుగుతున్న మనసును ముక్కలై విరిగిపోతోంది


14) కాలం మింగిన క్షణాలలో
నీకూ నాకూ మాత్రమే తెలిసిన నిజాలు కనుమరుగైన వేళ


15) నీడలు కమ్మిన చీకటి ప్రపంచంలో
వెలుగును దాచుకోవాలనే విఫల ప్రయత్నంలో నేను


16) మత్తెకించే మధుర మైన నీ దగ్గరితనం
దూరం అయ్యాక రక్తపు దుర్గందం వేస్తుంది ఎందుకో


17) చేదు నిజాలని నామీదకు వదిలి
తను మాత్రం చీకటి లోకి జారుకుంది నాకు కనిపించకండా


18) పశ్చాతాపంతో ఒకరోజు నీవు తప్పుతెలుసుకుని నాదరి చేరేలోగా,
ఏదూరతీరలకో నే చేరుకుంటాను నీవు ఎప్పటికీ నన్ను చేరుకోలేనంత దూరం


19) నా శ్వాస ఆగిపోనీయి, ఈ లోకం నుండి దూరమైపోనీయి
ఇంత బలమైన కోరికతో ఉన్నావని అస్సలు ఊహించలేదు కలలో కూడా


20) నీ స్వప్నాలనుండి నన్ను బయట పడనీయకు
నన్ను మనోవేదన అనుభవించనివ్వు అదేగా నీవు కోరుకొనేది


21) అవమానం మనస్సును ఇంత చింద్రం చేస్తుందని నాకు తెలియలేదు!
జగమంత నిదురపోతున్న నా కంటికి కునుకులేదు నేనేమైపోతున్నానో అర్దం అవ్వడంలేదు


22) మాటలకి మౌనందాల్చి నా ప్రతిమౌనానికి నీవే కారణం
మనసిచ్చి మరచిన నీవు నన్ను మరణం వైపు పరుగులు తీసేలా చేస్తున్నావు


23) నీకు ఏమీకాని నాకు ఎందుకీ అలజడి ఎందుకీ కలవరింతలు
గతి తప్పిన నా మనోవేదన నాదానివి కాదని చెప్పాక కూడా నీకోసం నాకెందుకీ ఆరాటం


24) ఒంటరినైన నాకు మౌనంతో స్నేహం కుదిరింది నీవల్ల
మౌనంగా భారమైన భాధని భరించాలని నీవు శాశించాక ఏం చేయను చెప్పు


25) వాడు గుండెల్ళొ గుచ్చి మరీ చుస్తున్నాడు
నేను బ్రతికున్నానా లేదా అని నీవిచ్చిన అలుసేగా అది


26) నాశ్వాసకు నీవు ఊపిరైనిలచావు
నీవు నాతో లేనినాడు నేను బ్రతికున్నానని ఎలా చెప్పను


27) గుండెకు గాయమై రోధిస్తున్న నాలాంటి వారిని చూస్తే అందరికీ అలుసే
ప్రాణం వీడిన నా దేహాన్ని ఎవరో కసిగా ముక్కలు చేస్తున్నారు అదినీవేనా


28) నీ ఊసుల దారాలతో అల్లుకున్న దుప్పటి కప్పుకొని
కలల అలల నురగలపై తేలియాడుతూ నేనేమైపోతున్నానో నిజమో బ్రమనో తెలియక


29) ఒంటరితనము ఏడ్వలేక నవ్వుతుంటే
చీకటిలో చిరునవ్వులు చిందిస్తున్న నిన్నేమని పిలవను


30) కనుమరుగై నీవు నన్ను కలవర పరిచావు
నా కంట నీరు నీకు కనిపించకుండా చేయలంటే ఏం చేయాలి


31) దూరమై నాకు నీవు నాకు ధుఃఖాన్ని మిగిల్చావు
నీకెప్పటికీ భారంకాకూడదని దూరంగా గుండె భరువు తో వెలుతున్నా నేస్తం


32) నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
బంగపడ్డ హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?


33) గతకాలపు జ్ఞాపకాలు నచ్చలేదా నీకు
చిత్తులే కదా అని ఓ మూలకి విసిరేసావెందుకని


34) మృత్యువు వెంట పరిగెత్తుతోంది నా పయనం
జీవితం మైనంలా మారి కరిగిపోతోంది నీవెచ్చనిస్వాసకు


35)    గాలి తెమ్మెరలవంటి నీ తియ్యటి మాటలు
అలలై ఎగసిపడే భావనలు నన్ను అంతంచేసేలా ఉన్నాయి


36) ఒక కల... అజ్ఞాతంగా అంతమైపోవాలని చూస్తోంది
అంతమై అందరిలో ఒంటర్ని చేసి సజీవ దహనం చేయాలని చూస్తోంది


37) రాత్రి రాకతో అంతమౌతున్న పగలు
చీకట్లో నన్ను చుట్టుముట్టిన నీజ్ఞాపకాలు


38) నాది నాది అన్న పదాలతో మనసులు దూరమైనా
మనం మనది అన్న మాటలతో గుండెల్లో ఎక్కడో అలజడి


39) ఎక్కడో ఎప్పుడో నన్ను నేను
జీవితాన్ని చేజార్చుకున్నాను ఇప్పుడు మిగిలిందంతా శూన్యం


40) నిష్క్రమిస్తున్నావు నీవు నా జీవితంలోంచి........
వెళ్ళు నేస్తం వెళ్ళు నేనెప్పుడు నీమాట కాదన్నానని ? ఎవరు ఎటుపోతే నీకేంటి?


41) నిన్ను మర్చిపోలేక నన్ను నేను ఓదార్చుకోలేక
అనుక్షణం సతమతమౌతూ బ్రతకలేక ఎన్నాళ్ళు..ఏన్నేలిలా


42) నీ ఆలోచనలూ నా మదిలో ఈదురు గాలులై
నన్ను కలవరపెడుటుంటే..గుండె ఎటో కొట్టుకపోతుంది ఒంటరై


43) అదే పనిగా తాకుతూనే ఉన్నాయి..
అనుక్షణం గుండెని గుచ్చుతూనే ఉన్నాయి నీ జ్ఞాపకాలు


44) నీవు రాక ఎందరున్నా ఒంతరవుతాను
కనుల ముందుకు నేరుగా నే రాను అంటావు ఎదురు చూస్తే ఎక్కడో ఉంటావు


45) కరుణ చిందించే కన్నులు కాంతి ని కోల్పోయి కలవర పడుతున్నాయి....
చిరు నగవులని చిందించే ఆ పెదవులు ఎండి పోయి నిస్తేజంగా మారాయి


46) స్నేహ హస్తాన్ని అందించు చిమ్మ చీకటినైనా చీల్చుకువస్తా
ప్రేమామృతాన్ని కురిపించు సప్తసంద్రాల్నైనా దాటేస్తా..నీవిప్పుడు మనసులేని మనిషివి


47) ఆమె వలలో చిక్కుకున్న సమయం
ప్రేమ లయలో దూకి ఆత్మహత్యిచేసుకుంది


48) నా కంటి రెప్పల పై అల్లుకున్న కాళరాత్రి వి నీవే
నీ ఉహల దారులలో నన్ను నడిపి నట్టేట ముంచింది నీవే


49) క్షణక్షణముకో మరణం..క్షణక్షణముకో జననం
నీ ప్రేమ పోందలేని ప్రతి క్షణం కోరుతుంది మరణం


50) మనస్సును మాయచేయడమా నీవు నేర్చుకున్న మానవత్వం....
మంచిని మరచి వంచన చేయటమే నేర్పారా నీకు..నీకంటూ ఓ మనస్సాక్షిఉందా...?


51) నీ తలపు సంజీవనై నన్ను బ్రతికిస్తున్నాయనుకున్నాను.....
కాని ఎడబాటుతొ గుండేను చీల్చి నన్నో శవంగా మారుస్తాయని ఊహించలేదు


52) కోటలు దాటిన మన మాటలు,
ఇపుడు మరణించాయా...? మరెందుకు ఆ శబ్దతరంగాలు ఆగిపోయాయి


53) గేలి చేస్తున్న కాలన్ని చూసి కన్నీరు కారుస్తున్నా
వేదిస్తున్న విధిపై నన్ను చంపేసేలాఉంది మనశాంతి కరువైంది ఎన్నాళ్ళో ఈ జీవితం


54) ఉద్వేగాలు నీడలా వెంబడిస్తున్నాయి....
వేదనతొ వొణీకించే విషాదపు సాయంత్రాలు సందిగ్ధతలంపులతొ వేదిస్తున్నాయి


55) నిశ్మబ్ధ విచీకలొ నీర్లిప్తంగా నీతొ కలిపిన అడుగులను
ఈ జన్మకు వరం అనుకున్నా నీ అంతరాత్మలొ నేను లేనని తలచుకొని విలపిస్తున్నా


56) గతంలొ నేను పారేసుకున్న నీ తలపుల అనుభూతులు...
భవిష్యత్తు లొనైనా దొరుకుతాయని ఆశ కాని రక్తపు మడుగుల్లో ఉన్నానిప్పుడు...?


57) హృదయం భావొద్రేకంతొ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నీ జ్ఞాపకం
ఈ గొంతులొ మాటరాక మూగబోయింది ఎక్కడో రక్తం చిందిన వాసన అదినాదేనా...?


58) ఓ నిర్వేదం నిర్లిప్తమైన క్షణానికి కారణం నీ జ్ఞాపకం
నీ పరిచయంతో సారం లేని బ్రతుకు శబ్ధనికి సారాంశం లేని నిశ్శబ్దాన్ని ఇప్పుడు


59) అధరాలపై కదులుతున్న అస్ధిత్వమైన అక్షరాలు అలసిపోయాయి
ఏకాంతంలొమనసు పొరలలొ అలసి అల్లుకున్న ఆశల అన్వేషణలో ఓడిపోయాను


60) కారణాలు లేకుండ వెడలిన నిన్ను చూస్తుంటే...
మౌనంతొ మరలుతున్నాను మళ్ళీ నీకు కన్పించకూడదని....శెలవు నేస్తం.


61) నావైపు దూచుకొస్తున్న అవ హేళనలు ,
అక్కర్లేని సానుభూతులు మింగలేనంత చేదు అనుభవాలు


62) ఓపలేనంత గుండే బరువు ..చూడలేనంత చీకటి
ఆపలేనంత పరుగు ..చేరలేనంత దూరం చెప్పలేనంత దిగులు ఏంటో జీవితం


63) నీ స్నేహం ప్రాణం పోస్తుందనుకున్నా
కాని ఇలా అవమానించి ప్రాణం తీస్తుంది అనుకోలేదు


64) నీ కళ్ళల్లో నన్ను చూసుకునే వేళ
మరొకరికి ఆనందాన్నిచ్చి నా కళ్ళల్లో కన్నిరై మిగిలావు..


65) నువ్వు వదిలిన శూన్యంలో దారి లేని శకలాన్ని అయ్యాను..
గుండె చీల్చుకొని నేను పేట్టే ఆక్రందన నీకు వినిపిస్తుందా ప్రియా


66) తెరలు తెరలుగ నీ ఆలోచనలు ఒక్కొక్కటి గా వెక్కిరిస్తుంటే ..
నాలోకి నేను చూసుకోటానికే భయపడుతున్నా ఏముందిక అంతా అయిపోయింది


67) నా హృదయంలో మెలికలుతిరుగుతుంది..
అర్ధంకాని సాయంత్రాలు మీ ఇద్దరి గుస గుసలు వినిపిస్తున్నాయి


68) నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా విచ్చుకుంటున్నాయి.
ఉప్పెనలా ముంచే నీ ఙ్ఞాపకాలతో నా తనువంతా కన్నీటితో తడిచిపోతుంది.


69) నీకు గురుతైనా రాని గడ్దిపువ్వును నేను..
నీ జ్ఞాపకాల చిత్తడి లో వెలసిపోయిన ఇంద్రధనస్సును నేను.


70) నీ గజిబిజి ఆలోచనలన్నీఅబద్దాలైయ్యాయి
తెలిసిపోతుందన్న పంతం తప్ప ఏముందిక్కడ..అంతా బ్రమేగా


71) ప్రపంచంలో నీవో ప్రత్యేకం అనుకున్నా
అందరిలాగే నీవు...మనసేలేని మనిషివి నీవు


72) నా మనసుని ఎందుకిలా వేధిస్తావు
నా కలలని ఎందుకిలా కాజేసావు..ఇదినీకు అలవాటా...?


73) ఎవరో నిర్మించిన చట్రాలలో ఇరుక్కపోయావు
మరెవరికోసమో నన్ను ఇలా వంచించావు ఇదేనా నీ స్వచ్చమైన స్నేహం


74) నీదాన్ని నేనంటు నాలోనే దాగుండి
ఎద కోరు సమయాన ఎగిరెళ్ళి పోతున్నావెందుకు


75) ఎండిపోతున్న మనసు బీటలై పోయేలా చేస్తుంది
ఎదురుచూపుల్లోన అడ్డమై ..నిజాలను కల్లు గప్పేలా చేస్తుంది కన్నీరు


76) ఓ చావుకు నిరసనగా చెట్లపైన గువ్వపిట్టలన్నీ
కలిసికట్టుగా నినాదాలు చేస్తున్నాయి అవి ప్రేమగల పక్షులు మనుషులు కాదు..?


77) ఈ గుండె లోతుల్లోని విషాదాన్ని
ఏమర్చి బ్రతుకు నడపాలన్న కోరిక చచ్చిపోయింది


78) ప్రేమను తొక్కిపెట్టావు తియ్యగా పలికే గొంతు మూగబోయింది    

79) కలాన్ని ఒలికించి ఏదో రాద్దాం అనుకొన్నా
మనస్సు కాగితంలా నలిగి చిరిగిపోయిందిగాని అక్షరాలు నిలబడలేదు


80) నీ ఆలోచనల వెనుక పరిగెడుతూ
నీ మనసుకు దగ్గరగా చేరాలనుకున్నా చేరలేకపోతున్నా


81) మనసు పొరలు చీల్చుతూ అంతరంగపు ఆవరణలో
చిందులేస్తున్న కలం చిమ్ముతున్న అక్షరాలు నీకోసం తపిస్తున్నాయి


82) కొబ్బరాకుల నడుమ నుంచి నిద్రను వెతుక్కుంటూ
జాబిలమ్మ ఒడిలోకి చేరి వెన్నెలను కౌగలించుకున్నా ఇది నిజమనుకొని


83) తెగని ఆలోచనల దారానికి ఎగురుతున్న
గాలిపటం లా మారింది నా జీవితం ఎగిరేది శాశ్వితంకాదని


84) సరసాలాడుతూ మనసును సందడి చేసింది
కళ్ళు తెరచి చూస్తే అసలు నిజం తెల్సింది నాతో కాదు ఎవరితోనో అని


85) పువ్వుల పరిమళాలను మోసుకొచ్చిన చిరుగాలి
నన్నుమత్తులో ముంచి ఎవరికోసమో పరులు పెడుతుంది ..నేనెలా ఆపను


86) కాలం పరుగెడుతూనే నీలానే
నేను మాత్రం ఆ చక్రాలక్రింద ఇరుక్కున్నా నెందుకో


87) మార్గమంతా ఒంటరి పయనమే
ముడి పడి విడి పడినా నీవు లేని నేనుగా మిగిలిపోయానుగా


88) జారుతున్న నా కన్నీటిని దోసిళ్ళలో పడుతున్నావు
నీదాహం తీర్చుకోవడాని ఏన్నని నాకన్నీళ్ళను కార్చను


89) క్షణం ముల్లుకు ఎంత సేపు వేలాడానో
ఇప్పుడే వస్తానని చెప్పివెల్లిన నీకోసం ఎదురు చూస్తూ


90) ఊహంత కమ్మగా నిజం ఎన్నడూ ఉండదు,
బ్రమలో నిజం దాగివుంటే అదో పదునైన కత్తి గుచ్చుకుంటే తియ్యలేం


91) ఎదురుపడ్డ జ్ఞాపకం ఎదనుకోస్తుంది
ఎదబీడులో ఎండిన అక్షరాలు తగలబడుతున్నాయి


92) అంతరాల్లో నీకోసం ఆరాటం
చేదు జ్ఞాపకాల అనుభవాలు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి


93) నా అన్న నేను నీలో ఉండిపోయినప్పుడు
నాలో నేను వెతుకుంటే ఏలా దొరుకుతాను చెప్పు


94) ఎవరన్నారు నేను ఫ్రేమలో ఓడిపోయానని..
నువ్వే నన్ను ఫ్రేమించడంలో ఘోరంగా ఓడి నన్ను వీడిపోయావు


95) కాలం మింగిన క్షణాలలో
నీకూ నాకూ మాత్రమే తెలిసిన నిజాలు కనుమరుగైన వేళ