ఊపిరాడని ప్రేమ కావాలి
తిరస్కరించే తీర్పులోద్దు,
కావలసిందల్లా,
నువ్వు నన్ను ప్రేమించు,
నీ ప్రేమను నే గౌరవిస్తా,
నేను నిన్ను గౌరవిస్తా,
నా గౌరవాన్ని నువ్వు ప్రేమించు.
కలకాలం నిన్ను గుండెల్లో పెట్టి పూసిస్తా
నీకు నేను చేరువయ్యే క్రమంలో,
నన్ను నేను పూర్తిగా కోల్పోతుంటే,
నేను నీకు దగ్గరౌతున్నా గాని
నువ్వు నాకు దూరమౌతున్నావెందుకో
సర్దుబాటు నాకే కాదు నీకు కూడా,
కోపతాపాలు నీకే కాదు నాకు కూడా,
మన్ననలు మన్నిపులు నాతో పాటు నీకు కూడా,
పంతాలు పట్టింపులు నీతో పాటు నాకు కూడా,
అలకలు అహాలు మనిద్దరివీనూ,
ప్రేమ, గౌరవం జంటకవులు
ఆ రెండు ఒకరిని ఒకరు గౌరవించుకొంటే
కలకాలం మనసులు కలుస్తాయి లేకుంటే
మనలా ఎప్పటికీ కలువలేని
సమాతర్ రేఖల్లా మిగిలిపోతాం
తిరస్కరించే తీర్పులోద్దు,
కావలసిందల్లా,
నువ్వు నన్ను ప్రేమించు,
నీ ప్రేమను నే గౌరవిస్తా,
నేను నిన్ను గౌరవిస్తా,
నా గౌరవాన్ని నువ్వు ప్రేమించు.
కలకాలం నిన్ను గుండెల్లో పెట్టి పూసిస్తా
నీకు నేను చేరువయ్యే క్రమంలో,
నన్ను నేను పూర్తిగా కోల్పోతుంటే,
నేను నీకు దగ్గరౌతున్నా గాని
నువ్వు నాకు దూరమౌతున్నావెందుకో
సర్దుబాటు నాకే కాదు నీకు కూడా,
కోపతాపాలు నీకే కాదు నాకు కూడా,
మన్ననలు మన్నిపులు నాతో పాటు నీకు కూడా,
పంతాలు పట్టింపులు నీతో పాటు నాకు కూడా,
అలకలు అహాలు మనిద్దరివీనూ,
ప్రేమ, గౌరవం జంటకవులు
ఆ రెండు ఒకరిని ఒకరు గౌరవించుకొంటే
కలకాలం మనసులు కలుస్తాయి లేకుంటే
మనలా ఎప్పటికీ కలువలేని
సమాతర్ రేఖల్లా మిగిలిపోతాం