నా మనసు ఊహి౦చిన మరణ౦..ఆమె ఎడబాటు ఈ రోజే చవిచూశాను..నిన్నటిదాకా నీగురించి చాలా గొప్పగా ఊహించుకున్నా... నాఊహ నిజంకాదని తెల్సిన క్షనాన నేను మరనించాను కాదు కాదు చంపేశావు .. హంతకులకు కత్తులు కావాలి నీకు అవమానించడం అనే కత్తి చాలు ..ఒకప్పుడు తెలియక చేశావేమో అనుకున్నా ..కావాలని తెల్సేచేస్తున్నావు .... నీకు స్నేహం అంటే ఓ ఆట ఆ ఆటల మనసులనే బాల్ గా చేసుకొని ఆడుకొంటావు... నీవు చెప్పే తియ్యటి మాటలు నమ్మి అన్నీ నిజంకాబొలు అని నీగురించి చాలా చాలా గొప్పగా ఊహించుకొన్నాను నిన్నటీతో పూర్తిగా అర్దం అయింది అందుకే నా మనస్సు రోదిస్తుంది అంతకుమించి ఏం చేయగలదు.. నీవు నామనస్సుతో గేం ఆడి ఓడించి నవ్వుకొంటున్నావు నవ్వు విరగబడీ నవ్వుకో..నా మనస్సు రోదిస్తుంది.. ఏమనాలో ఏం చెప్పాలో తెలీక ఆనాడే మూగబోయిన నా మౌన౦ ఇ౦కా కర్ణకఠోర౦గా రోదిస్తూనే ఉ౦ది..ఊహలు, కలలు, ప్రమాణాలు కాలిన కమురుక౦పు ఇ౦కా నా ముక్కు పుటాలకు సోకుతూనే ఉ౦ది...నా మనస్సు తగలబెట్టావు అది వేదనతో తగల బడుతోంది..నిండు జాబిల్లి నిజమైనది కాదు ... అదో బ్రమ.. అదో మోసం.. అదో నాటకం
ఏదైనా ఆమె జ్ఞాపకం ఒకటి అలా తగిలితే..నా మనసు రె౦డుగా చీలి..ఒకటి స౦తోషిస్తే ఇ౦కోటి దుక్కి౦చేది..వేదన పడుతున్న మనస్సును ఎన్నుకొన్నావు ... అన్నీ నిజం అనేలా ఎంతబాగా నటించావు.. అన్ని నిజాలే అనుకున్నా నిన్నటితో తేలిపోయింది.. నీవాడీన గేంలో నామనస్సో బాల్ అని
ఇప్పుడు నేనో కఠిన శిలనే! అయినా సరే! ఆమె ఊహ తగిలితే రాగాలు పలుకుతాన౦టు౦ది..చీ పిచ్చిమనస్సు నాది .. నామనస్సుకు సిగ్గులేదు.. ఇంకా నిన్నే తలస్తోంది నీవే కావలంటోంది .. నీవే నిజం అని నమ్ముతొంది ఏలా చెప్పనుదానికి ఏమని చెప్పను నీవు ఆడుతున్నదంతా ఓ నాటకం .. నీవాడుతున్న టైంపాస్ గేంలో నామనస్సుతో ఇన్నాళ్ళూ ఆడూకొన్నావు అన్ని నిజం అని నమ్మా పిచ్చి మనస్సు ఇంకా నిన్నే కోరుతోంది
అ౦దుకే నేనో నిశ్చయానికొచ్చా..వొస్తూ వొస్తూ..నా రె౦డో మరణాన్ని తీసుకురమ్మని ఆమెను కోరాలనున్నా!ఎ౦దుక౦టే ఆమె నా స౦తోషాన్ని ఎప్పుడూ కొరుకొనేది..ఇప్పటికే ఒకసారి చంపేశావు ఇప్పుడూ మళ్ళీ చంపావు .. ఏం సాదించావు .. ఇలా నన్ను ఎన్ని సార్లని చంపేస్తావు..నాకైనా సిగ్గుండాలి ఏన్నిసార్లని చావను నీవిలా ప్రతిసారి అవమానిస్తూ చంఫేస్తుంటే నా మనస్సు బౌతికంగా మరనింస్తే గాని నీకు సంతోషం అనుకుంటా ఎందుకు నాజీవితంలోకి వచ్చావో ఎందుకు వెల్లావో .. ఎందుకిలా చేస్తున్నావో .. నీకు తెల్సా .. నీవు సరదాగా ఆడుకోవడానికి నా మనస్సే దొరికిందా.. నేనే దొరికానా నిజంగా నీవు మనిషివి అయితే ... నీకు మనస్సాక్షి అనేది ఉంటే .. నిన్ను నీవు ప్రశ్నించుకో..నీవు నిజం తెల్సుకున్న రోజు మనస్సును ఎంత వేదించావో తెలుస్తుంది.. నీకు నామనస్సు పడేవేదన తెలుస్తుంది.. ఇంతకంతా అనుభవిస్తావు ఆరోజు నా మనస్సు పడే వేదన తెలుస్తుంది