వాడిపోయే పువ్వులే
మాలల అల్లిక
మానగలమా?
ఎగిరిపోయే పక్షే
గూటిలో పొదుగుట
ఆపగలమా?
ఏ దారి ఎటు పోవునో
ఒంటరి బాటసారిలా
పయనం ఆగునా?
ఏదో ముడిపడుతున్న బావన
అంతలోనే విడిపోతున్న వ్యధ
ఎప్పటికైనా
సమాదానం దొరికేనా?
తెలిసినా బదులేది?
మనసుకు ఊరటేది?
మనసు పొడుగునా
ప్రశ్నల పలకరింపులే
మార్గమంతా ఒంటరి పయనమే
ముడి పడి విడి పడినా
ఏకాంతమే మైత్రీ బంధం…
ఒంటరితనంలో
నిన్ను తలుచుకుని
దుఃఖిస్తూ వుంటాను
ఏకాంతంలో నీతో
ముచ్చట్లు చెపుతూ వుంటాను
నాలో ఇంకా బతికున్న నేను నువ్వు
నిన్ను గుండె గదిలో ఆమూల బంధించేసాను
మాలల అల్లిక
మానగలమా?
ఎగిరిపోయే పక్షే
గూటిలో పొదుగుట
ఆపగలమా?
ఏ దారి ఎటు పోవునో
ఒంటరి బాటసారిలా
పయనం ఆగునా?
ఏదో ముడిపడుతున్న బావన
అంతలోనే విడిపోతున్న వ్యధ
ఎప్పటికైనా
సమాదానం దొరికేనా?
తెలిసినా బదులేది?
మనసుకు ఊరటేది?
మనసు పొడుగునా
ప్రశ్నల పలకరింపులే
మార్గమంతా ఒంటరి పయనమే
ముడి పడి విడి పడినా
ఏకాంతమే మైత్రీ బంధం…
ఒంటరితనంలో
నిన్ను తలుచుకుని
దుఃఖిస్తూ వుంటాను
ఏకాంతంలో నీతో
ముచ్చట్లు చెపుతూ వుంటాను
నాలో ఇంకా బతికున్న నేను నువ్వు
నిన్ను గుండె గదిలో ఆమూల బంధించేసాను