ఎన్నెన్నో ఊసులు
పంచుకున్న భావాలు
చిరు అలకల సవరింపు
చిరు నవ్వుల కొసరింపు
ఎన్నెన్నో సందేశాలు
చూపులతో సంకేతాలు
చిన్న చిన్న సంతోషాలు
వయసేరుగని ఉత్సాహాలు
నా కవితకి నీ స్పందన
నీ ఊహకి నా సవరణ
మనసులు కలిసి
మమతలు పెరిగి
తలువగానే కలవాలని
కలవగానే చేరువవ్వాలని
అల్లుకోవాలని
ఎదో ఆశ
చెంతకు రాగ సందేహం
కళ్ళతోనే ఆహ్వానం
ఏమో ఏదో తడబాటు
ఎదలోతులలో ఒక లోటు
తెలియని వులికిపాటు
ఎదురుగ రాగా కలిగే విభ్రమం
తొలిసారిగ కలిసిన మది సంభ్రమం
ఎలా రాసేది
మనసున మొలిచే ప్రతి భావాన్ని
ఎలా చెప్పేది
గుండెలోని ప్రతి కదలికని
మనసైన మనిషికి అర్థమౌతుంది
నా మనోగతం ...స్వగతం
పంచుకున్న భావాలు
చిరు అలకల సవరింపు
చిరు నవ్వుల కొసరింపు
ఎన్నెన్నో సందేశాలు
చూపులతో సంకేతాలు
చిన్న చిన్న సంతోషాలు
వయసేరుగని ఉత్సాహాలు
నా కవితకి నీ స్పందన
నీ ఊహకి నా సవరణ
మనసులు కలిసి
మమతలు పెరిగి
తలువగానే కలవాలని
కలవగానే చేరువవ్వాలని
అల్లుకోవాలని
ఎదో ఆశ
చెంతకు రాగ సందేహం
కళ్ళతోనే ఆహ్వానం
ఏమో ఏదో తడబాటు
ఎదలోతులలో ఒక లోటు
తెలియని వులికిపాటు
ఎదురుగ రాగా కలిగే విభ్రమం
తొలిసారిగ కలిసిన మది సంభ్రమం
ఎలా రాసేది
మనసున మొలిచే ప్రతి భావాన్ని
ఎలా చెప్పేది
గుండెలోని ప్రతి కదలికని
మనసైన మనిషికి అర్థమౌతుంది
నా మనోగతం ...స్వగతం