1) కొందరు నీకోసం అక్షరహీనమైన భావాల ప్రవాహం
నిర్లజ్జమైన ముసుగు నవ్వుల కోళాహాలం వెనుక నిన్ను చేస్తున్న అవమానం గుర్తించు
2) నా నుండి నేను దూరమవుతూ శూన్యంలో నిన్ను వెతుకుతూ నేను
3) కదిలే కాలం తన కాళ్ళ కింద నా హృదయాన్ని అణచివేస్తున్నా.
మరణించే కాలం మిగిలున్నంతవరకు నీ చెలిమి నన్ను మరవనివ్వదు
4) నా విరహం ఊపిరి వదిలింది.
ఎన్నో వెన్నల రాత్రులు నీ తోడు లేక ఉసూరుమన్నాయి.
5) మనిద్దరం చెరోదారై విడిపోయినా
నిరంతరం జ్వలించే అక్షరం నీకోసం వెతుకుతుంది
6) శబ్దమై నిశబ్దమైన వేళ
తరంగాలలో అంతరంగాలా ఆటుపోట్లు
7) వర్తమానాన్ని సర్రున చింపి
నా జ్ఞాపకాల అంచులగుండా నిన్ను చేరాలనే విఫల ప్రయత్నం
8) ఏడుపు ఏడుపొరల దేహంలో ఇంకిపోతూ
ఎనిమిదవపొరగా రూపాంతరమైన అక్షరం నన్ను చంపేస్తోంది
9) చల్లగాలి సయితం బగ్గు బగ్గున మండుతూ
నన్ను నిలువునా కాల్చివేస్తుంటే ఏటువైపు చూడను ఏమని అడుగను
10) బరువెక్కిన మనసుతో భరించం కష్టమే
ఒంటరి అన్న మాటకు దాస్సోహం అయ్యానంటే నీవే కారణం
11) నింగికి సొంతమైన జాబిలి నా చేతిలో ఉన్నట్లుంది,
నాకోసం ఒక శ్వాస ఎదురుచూస్తున్నట్లు వుంది నిజమో బ్రమో తెలియడంలేదు...?
12) ఒంటరిగా ఉన్నా నాతో ఎవరో వున్నారనిపిస్తోంది,
చెప్పలేని గుసగుసలు వినిపిస్తోంది చుట్టూ చూస్తే అంతా నిశ్శబ్దం ఏంటో
13) కరిగిపోయన కాలంలో నిలవలేని క్షణమే నేను…
నీటిపైన రాతలా మార్చావు నా పిచ్చి మనసును నీకు ఏదైనా నీకు సాద్యమే..?
14) చీకటి వేల జాబిలమ్మ వెలుగు చూపిస్తుంది.
నీడలా తన చివరి శ్వాసవరకు మనతో వుంటుంది....ఇది నిజమా ..?
15) మెరిసిన జ్ఞాపకం ఉరిమిన గొంతు, కురిసిన కళ్ళు..
కన్నీటి వాన ఎంత అందమైనదో హృదయానికి భారాన్ని తగ్గిస్తుంది
16) కంటతడి ఆరని చెంపల మీద
అక్షరాలను పేర్చి పదాలతో నాకు నేను అగ్గి రాజేసుకుంటున్నా
17) సాయంత్రం ఎప్పటిలానే ఎర్రటి భానుడ్ని భుజానేసుకుని
పడమటి దిక్కుగా చీకట్లను చీల్చి కాస్తవెలుగుల కోసం జాబిలమ్మను వెతుకుతూ
18) గుండె గాయాలు పూడ్చుకోవాలని చూస్తాను
జ్ఞాపకాలు ఆగాయాలను గెలికి పుండుగా మారుస్తాయి
19) చివుక్కు మన్న మనసు శబ్దానికి
పెదవులు భయపడి మూగబోయి మనస్సు మౌనంగా రోదిస్తుంది
20) నా మనసు మీద మరో ముల్లు గుచ్చుకుంది
గుండెకు గాయం చేసి నా మనస్సు ఎర్ర గులాబీ అయింది
21) ఇక నేనేం చెప్పను..నేనింకేం చెయ్యను ..
ఆక్రోశంతో కవిత ఉప్పొంగుతుంది..ఏమీ చేయలేనని తేలిపోయింది
22) నా బ్రతుకెలా మారిపోయింది
నేనెలా ఉండేవాడినో కూడ మర్చిపోయాను నీవల్ల
23) ఈ గుండె లోతుల్లోని విషాదాన్ని ఏమర్చి బ్రతుకు నడపాలన్న కోరిక
నాకు ఏ కోశానా లేదు అది ఎందుకో నీకు అర్ధచేసుకునే మనసుందా అనిపిస్తుంది
24) ప్రతి సాయంత్రం మన కలయిక కోసం కలవరిస్తా
నన్ను కలవాలనుకోని నీమనసుకోసం తపించడం..నాలో నేను తన్నుకు చావడం
25) సాయంత్రం చూస్తూండగానే చీకటి ఊహల ద్వారాలను తెరిచింది
కదిలే కాలం జ్ఞాపకాలను స్వప్నాలుగా మార్చి కనుల ముందు నిలిపింది
26) నా గుండెని సగం కోసి పోయావు
ఇంకో సగం మిగిలిందనా ముక్కలుచేయడానికి ఎవరినో పంపావు
27) నన్ను మురిపించి మై మరపించిన మాటలు
సంద్రపు హోరులో వెతుక్కోమంటూ మౌనం వహిస్తున్నాయి
28) ని పదాలు వినలేని నేను
ఈ శూన్యపు లోకాల్లో బందీనై ఉండిపోయాను
29) నిజమైన బంధాలు తుంచుకుంటున్నావు
అదే భ్రమలో జీవిస్తూ ఇంకా ఇప్పటికీ..గాలినై తిరుగుతున్నాను...
30) నీనోటినుండి రాలిన ముత్యాలను ఏరుకుంటూ
కలల సంద్రంలోకి జ్ఞాపకాల సుడిగుండంలోకి ఒంటరిగా...నేను
31) నీవు నేను కలిస్తున్న క్షణాలను నిర్ధాక్షిణ్యంగా మింగేసిందీ కాలం
ఒంటరిగా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే తడిమింది నీవు చేసిన గాయం
32) మనిద్దరి గజిబిజి జ్ఞాపకాలలో
చిరిగిన హృదయాల్ని ఒకటిగా చేస్తూ కుట్లువేస్తున్నా
33) ఒంటరితనంలో నిన్ను తలుచుకుని
ఏకాంతంలో నీతో ముచ్చట్లు చెపుతూ వుంటాను
34) మనసు పొడుగునా కలవరింతలే
ప్రశ్నల పలకరింపులు మార్గమంతా ఒంటరి పయనమే
35) మనసులో విషయాన్ని చెబుదాం అనుకుంటే
కనుచూపుమేరలో మనసున్న మనుషులే లేరెందుకో
36) అనుభవాల్ని అక్షరాల్లోకి మారుస్తుంటే
అదేంటో గుండెల్లో మంటగా అనిపిస్తుంది ఎందుకనో చెప్పవూ
37) నక్షత్రాలు రాత్రుల్లోవెలుగుతాయి
పగలు తమవగలు పోవెందుకో సూర్యుడంటే భయమా..?
38) నీ మనసు మూగదైందనుకుంటా
నామనస్సుతో మాట్లాడలేకపోతోంది ఎందుకో
39) చీకటి కూడా వెలుగుకేసి నడుస్తుంటే,
ఈ నిరాసేంటి నన్ను వదలి పోను అంటుందేంటి ప్రియా
40) ఏదో ముడిపడుతున్న బావన..అంతలోనే
విడిపోతున్న వ్యధ ఎప్పటికైనా సమాదానం దొరికేనా?
41) నువ్వు కనపడితే నా కళ్ళు వర్షిస్తాయి కనపడకపోతే
మళ్ళీ వర్షిస్తాయి ఒకసారి ఆనందంతో అయితే మరోసారి దుఃఖంతో...
42) నువ్వు నవ్వితే నాకు ఆనందం
కానీ ఆ నవ్వు వేరొకరి సమక్షంలో ఐతే నేను బాధ పడతాను.
43) ఏదో ముడిపడుతున్న బావన అంతలోనే
విడిపోతున్న వ్యధ ఎప్పటికైనా సమాదానం దొరికేనా
44) నీ జ్ఞాపకం గాయం చేసింది అందుకే ఉక్కిరి బిక్కిరి
అవుతుంది ఊపిరి అందట్లేదు మనసు మెలి తిరిగిపోతోంది...?
45) గుండె నుంచి ఆలోచనలు జారిపోతున్నాయి
గతంకోసం తవ్విన తవ్వకాల గుంతల్లోకి జారి బురదలో ఇరుక్కపోతున్నాయి
46) నేను మనిషన్నది గుర్తుకువచ్చి
అలా నిశ్చలంగా ఆగిపోయాను ఇప్పుడెందుకు ఆవిషయం గుర్తుకొచ్చిందో
47) గతమంతా ఓ ప్రశ్నగా నన్ను నిలదీసినప్పుడు
సమాధానాల వెతుకులాటలోనే ప్రస్తుతం గడచిపోతోంది
48) అటు ఇటు చూసి ఒంటరిగా ఉన్న
నన్ను హటాత్తుగా తనలోకి లాగేసుకుంటుంది నీ జ్ఞాపకం
49) ఏమూలో చిక్కుకుపోయిన మనసును,
అవమానపు ముళ్ళులు గుచ్చి గుచ్చి భాదిస్తూనే ఉన్నాయి
50) నీకోసం ఆలోచనల చిక్కుముడుల నడుమ,
ఏమూలో చిక్కుకుపోయిన మనసు ఇంకా నీకోసం తడుముకొంటూనే ఉంది
51) మనసు నిజంగానే గాజుపలక
నీమాటలతూటాలకు ఎప్పుడో పలిగి ముక్కలైంది
52) నువు చూడగలిగితే నా అంతరాత్మలోకి
తొంగి చూడు..నువు లేని ఆత్మ మండిపోతూ కనిపిస్తుంది
53) నిదుర నాకు దూరమై వేదన చేరువై
నిశిరాత్రి నీ జ్ఞాపకాలు నన్ను కలవపరుస్తున్నాయి ఎప్పటిలాగే
54) పగలు కరిగిపోయింది రాతిరి వచ్చేసింది
స్వప్నాలను చెదరగొట్టడానికి నీజ్ఞాపకాలు రెడీవుతున్నాయి అందంగా
55) గాయాలు జ్ఞాపకమై సలిపినప్పుడల్లా
హృదయ౦లోకత్తిదిగిన బాధ చేసింది నీవుకాబట్టి తప్పించుకోలేనేమో
56) నీ జ్ఞాపకాల లోయల్ని తవ్వుకుంటున్న నాకు
ఏ అర్ద్ర రాత్రో నీ తియ్యని స్వప్న౦తో నేను నిద్రను వెలిగి౦చుకు౦టాను.
57) చెక్కిలిమీద చారికై నిలిచిన నీ జ్ఞాపక౦
మళ్ళీ ఆలోచనల్నిరేపి నీవు నను వీడి నడిచెల్లిన దారిని చూపిస్తుంది
58) నా గుండెలొ జ్ఞాపకమై గుట్టుగా చేరావు,
మౌనన్ని గుండేలో గుట్టగాపోసి మాయచేసి పోయావు ఇది నీకు న్యాయమా
59) కన్నీటిలో అలుక్కుపోయిన అక్షరాలు విడదీస్తుంటే
నా మనసులా చిల్లులు పడ్డ కాగితం మరి కాస్త చిరిగి అక్షరారు దొర్లిపోయాయి
60) వస్తువు పగిలితే శబ్దం వస్తుంది
మనసు పగిలితే నిశబ్దం మాత్రమే మిగులుతుంది
61) నువ్వు అక్కడ నేను ఇక్కడ దారులు వేరు..గమ్యాలు వేరు ..
ఊహల్లో నేను కలల అలలై ఎగసి పడుతుంటే నేను నీ తలపుల కోసం ఆరాటపడుతున్నా
62) ఎదో స్పర్శ, నా చెక్కిలిని తడుముతూ..
నను ఓదార్చుతున్నట్టుగా వుంది, అది నీవే కదా..ప్లీజ్ బ్రమ అని చెప్పకూ
63) కలనైనా నిన్ను చూద్దామని కనులు మూస్తే,
కన్నీటిసుడుల మాటున నీరూపం కరిగిపోతుందేమో అని భయం
64) ఎందుకో కొన్ని అక్షరాలు నచ్చితే హత్తుకుంటాయి
నచ్చకపోతే పక్కకుపోతాయి ఎందుకుకే అని ముసుగేస్తే అక్షరాలు తిరగబడతాయి
65) నీవు దూరం అయిన విషాదం గుండెళ్ళోకి చేరినప్పుడు..
భాదను తీర్చేందుకు నీజ్ఞాపకాలను పలుకరించేందుకు అక్షరాలు తోడయ్యాయి
66) ఏదన్నా రాద్దామని మొదలపెడితే గుచ్చుకుంటున్న నీజ్ఞాపకాలు
విరహాలు, విషాదాలే కలంనుండి నిజాలై అక్షరాలుగా జారి పడుతున్నాయి
67) ఎగిసిపడే నీ ఆలోచనలలో తడిసి ముద్దయ్యే నన్ను
నీ జ్ఞాపకాలు కౌగిలించుకుని గుండెల్లో కసిదీరా పొడుస్తున్నాయి
68) నాలో ఏ మూలో దాక్కున్న అంతర్మదనం పగలంతా నిద్రలో జోగుతూ
రాత్రుళ్ళు కత్తులు దువ్వుతూ తలలు నరుకుతూ స్తైర్యవిహారం చేస్తూ రక్తం చిందిస్తోంది
69) నా మనసును గాయం చేసి శూన్యంలో మాటలు వెతకలేక,
నాకు నేను మూగబోయినప్పుడు మాటల వర్షం కురుస్తుందేమో అని ఎదురు చూస్తున్నా
70) ఎగిసిపడే ఆలోచనలలో తడిసి ముద్దయి
నన్ను నేను అక్షరాలతో కౌగిలించుకున్న భావాలు భాకుల్లా గుండెల్లో దిగబడ్డాయి
71) నన్ను కౌగిలించుకుంటున్న చీకటి రాత్రుళ్ళలో రాలిపడుతున్న
జ్ఞాపకాల నక్షత్రాలు ఎన్నో ప్రశ్నలు సందించి నిద్రను దూరం చేస్తున్నాయి
72) నీలో న్నిశ్శబ్దపు అగాధాలు
చూడాలంటే ఎక్కడా చిన్న ఆధారం దొరక్కుండా చేశావుగా
73) నీ జ్ఞాపకం నా తలంపులలో ప్రాణం పోసుకుని శ్వాసలో కరిగిపోయి
గుండెలో ఒదిగి మనసంతా పరుచుకుని నా తనువులో ప్రాణమై నిలిచిపోయింది
74) నాలో దాగి ఉన్న వేల మాటలు మూగబోయి సమాది అయిన క్షనం
కన్నీరు ఘనీభవించి కన్నుల్లో గుచ్చి రక్తం ధారగా కారేలా చేస్తున్న నీ కాటిన్యం
75) పలకరిపు సైతం వినలేని చెవిటితనం,
కన్నీరు కమ్మేసి చీకటి మాత్రమే కానవచ్చే గుడ్డితనం..ఇదే ప్రేమలొ గొప్పతనం
76) గుండెను పిడికిలిలో పిండేసి ..ఆశను అరచేతిలో నలిపేసి,
బాధను భద్రంగా బయటకు తీసి నీవు బహుమతిగా ఇచ్చిన ఒంటరితనం
77) స్పర్శ కోల్పోయి స్పందన నశించిపోయి కూడా
ఎండిన హృదయం ఎవరికోసమో..ఇంకా ఎదురు చూస్తూనే ఉంది..?
78) మనసు పొరలను కెలుకుతూ ఆవేదనను సిరాగా నింపుకుని,
ఆవేశపు పదాల వెనుక పరుగులు... నీ హృదయాన్ని తాకలేని పరుగు ఎందాక
79) నాలో నేను వెతుక్కునే ప్రయత్నం..నాతో నేను చేసుకునే స్నేహం,
నాతో నేను చెప్పుకునే కబుర్లు చుసారా...నా వాల్ పై ఎన్ని విషేషాలో అవే ఇవి
80) ఒంటరితనంలో తోడు కోసం వెతుకుతున్నప్పుడు,
ఓదార్పు కోసం ప్రాకులాడుతున్నప్పుడు నాకు నేను మాత్రమే మిగిలా ఇప్పుడు,
81) మనసువిప్పి నీతో మాట్లాడాలి అనుకున్న క్షణం..
నిశ్శబ్దం నీడగా ఏకాంతం తోడుగా నాతో కలిసి విహరించింన మౌనం
82) కన్నీరునిశ్చలత్వం లోపించి కనుమరుగౌతోంది
కాలప్రవాహంలో కొట్టుకుపోయి గతం గమ్యిందాటితే ఇంతేనేమో ఎప్పటికీ
83) చేతకానితనం సానుభూతిగా చూస్తూ,
ఆత్మీయులే ఎవరివంచనో చేరి ఎగతాళిగా వెక్కిరిస్తుంటే,
84) ఏమూలో చిక్కుకుపోయిన మనసును,
ఆలోచనల చిక్కుముడుల నడుమ ఆంతరించిపోతున్నా ఆత్మీయతలు
85) కళ్ళల్లోనే ఉసులన్నీ వినిపిస్తాయి,
కళ్ళల్లో కళ్ళు పెట్టి వెతికినా కన్నీళ్ళను చేతులతో తోడినా ఏం కానరాదు...?
86) మనిషి ఎంత చిత్రమో..మనసు అంత విచిత్రం,
ఆలోచనలు అనంతం..ఆశలు అపరిమితం చేతలు మాత్రం పరిమితం,