ఎక్కడో మనసు
కాలుతున్న వాసన
ముక్కు పుటాలను తాకి
మనస్సును
అతలాకుతలం చేస్తోంది
శ్వాసలో నా వాసన
నాకే తెలుస్తున్న బావన
దహనమైపోతున్నది ఎవరూ?
నా అంతరాత్మ?
కాదు కాదు…ఇది నేను
నాకు నేనుగా నీకోసం
సమూలంగా తగలబడుతున్నా
తప్పని పరిస్థితుల్లో కాదు తప్పలేదు..
నీకోరిక ఇదే కదా అందుకే
ఎవరో ఏడుస్తున్న శబ్దం
చెవులు రిక్కించి ఆలకిస్తున్నా
ఎక్కడో విన్న గొంతులా ఉందే
అది నీవేకదూ చుట్టూ చూసేవారికోసం
నీవు నటిస్తున్నావు ఏడుస్తున్నట్టు కదూ
నేను నా వాళ్ళు అనుకున్న
వాళ్ళు కూడా నీలానే నటిస్తున్నారు
అందరరూ ఒకేలా బిహేవ్ చేస్తున్నారు
అచ్చం మనుషుల్లానే...
నటనే మీజీవితమా మసస్సాక్షి అనేదిలేదా..?
కంపించిన ఎద మిగిల్చిన
శిధిలాల మధ్య మూగగా రోదిస్తున్నది
నాలో నేనా?..
అవును అదినేనే నాలోనేనే
నన్ను నీవు మోసం చేసి నమ్మినప్పుడు
నాకీ వేదన తప్పదుగా
అందరిలా నటించి పబ్బం
గడపడం నాకు చేతకాదుకదా
నేను కాదని
నన్ను నేను నమ్మించుకోవటానికి
నన్ను నేను దహించుకుంటున్నా
రండి రండి
నా దహన సంస్కారానికి హాజరవ్వండి
"ఓయ్" నీకు ప్రత్యేకమైన ఆహ్వనం
నీకు జీవితంలో ఎంతో ఆనందకరమైనవార్తకదూ
పైకి ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నా
లోపల నీ ఆనందం కళ్ళలో కనిపిస్తుందిలే
ఇంకా
ఎందుకా ఎగతాళులు?
ఎందుకా వంకర నవ్వులు?
ఇప్పుడు
కొద్ది క్షనాలాల్లో నేనుండనుగా
అదేగా మీరు మనస్పూర్తిగా కోరుకొనేది
మీ కళ్ళెదురుగా దహనమౌతున్న నిజాన్ని
కాలుతున్న వాసన
ముక్కు పుటాలను తాకి
మనస్సును
అతలాకుతలం చేస్తోంది
శ్వాసలో నా వాసన
నాకే తెలుస్తున్న బావన
దహనమైపోతున్నది ఎవరూ?
నా అంతరాత్మ?
కాదు కాదు…ఇది నేను
నాకు నేనుగా నీకోసం
సమూలంగా తగలబడుతున్నా
తప్పని పరిస్థితుల్లో కాదు తప్పలేదు..
నీకోరిక ఇదే కదా అందుకే
ఎవరో ఏడుస్తున్న శబ్దం
చెవులు రిక్కించి ఆలకిస్తున్నా
ఎక్కడో విన్న గొంతులా ఉందే
అది నీవేకదూ చుట్టూ చూసేవారికోసం
నీవు నటిస్తున్నావు ఏడుస్తున్నట్టు కదూ
నేను నా వాళ్ళు అనుకున్న
వాళ్ళు కూడా నీలానే నటిస్తున్నారు
అందరరూ ఒకేలా బిహేవ్ చేస్తున్నారు
అచ్చం మనుషుల్లానే...
నటనే మీజీవితమా మసస్సాక్షి అనేదిలేదా..?
కంపించిన ఎద మిగిల్చిన
శిధిలాల మధ్య మూగగా రోదిస్తున్నది
నాలో నేనా?..
అవును అదినేనే నాలోనేనే
నన్ను నీవు మోసం చేసి నమ్మినప్పుడు
నాకీ వేదన తప్పదుగా
అందరిలా నటించి పబ్బం
గడపడం నాకు చేతకాదుకదా
నేను కాదని
నన్ను నేను నమ్మించుకోవటానికి
నన్ను నేను దహించుకుంటున్నా
రండి రండి
నా దహన సంస్కారానికి హాజరవ్వండి
"ఓయ్" నీకు ప్రత్యేకమైన ఆహ్వనం
నీకు జీవితంలో ఎంతో ఆనందకరమైనవార్తకదూ
పైకి ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నా
లోపల నీ ఆనందం కళ్ళలో కనిపిస్తుందిలే
ఇంకా
ఎందుకా ఎగతాళులు?
ఎందుకా వంకర నవ్వులు?
ఇప్పుడు
కొద్ది క్షనాలాల్లో నేనుండనుగా
అదేగా మీరు మనస్పూర్తిగా కోరుకొనేది
మీ కళ్ళెదురుగా దహనమౌతున్న నిజాన్ని