నీ పెదవులపై దోబూచులాడే
చిరునవ్వుకు చిరునామా
నా తలంపులైనప్పుడు…
నా శాశ్వత చిరునామా నీ హృదయమే…
నా కళ్ళలో తళుక్కున మెరిసే
మెరుపుకు కారణం
నీ పలకరింపైనప్పుడు…
నీ ప్రేమ శాశ్వతం
నా హృదయంలో….
నా పెదాలు పలికితేనే,
నీ చెవులు ఆలకించి,
నీ హృదయానికి
చేరవెయ్యాలా నా బావాన్ని?
మౌనంగా నా కళ్ళు,
నీ మనసుతో మాట్లాడట్లేదు?
నీ హ్రదయం వినట్లేదు?
అది నిజం కానప్పుడు,
నా మాటలు పెడర్ధాలుగా మారి,
నీ హృదయాన్ని గాయపరచవూ?
నీ మనసుని ముక్కలు చెవ్వవూ?
ఇక,నేను మౌనాన్ని ఆశ్రయించక,
మాటలతో యుద్ధానికి దిగనా?
యుద్ధంలో గెలిచేది,నువ్వా,నేనా
అక్షరాలు మాట్లాడుతున్నాయి
పదాలు బావాలు పలుకుతున్నాయి
వాక్యాలు వ్యాకరణం పొందిక లేకున్నా
జీవితపు నిగూఢ సత్యాలు
తమలో దాచుకున్నాయి….
దాపరికాల్లో నిజాలున్నా
నమ్మేవారులేక ఇలా
ఒంటరిగా మిగిలిపోయాయి
మాటల్లో మర్మాలు తెలీక...
మదిలోని బావాలు బందీ అయితే ఇంతేనేమో
చిరునవ్వుకు చిరునామా
నా తలంపులైనప్పుడు…
నా శాశ్వత చిరునామా నీ హృదయమే…
నా కళ్ళలో తళుక్కున మెరిసే
మెరుపుకు కారణం
నీ పలకరింపైనప్పుడు…
నీ ప్రేమ శాశ్వతం
నా హృదయంలో….
నా పెదాలు పలికితేనే,
నీ చెవులు ఆలకించి,
నీ హృదయానికి
చేరవెయ్యాలా నా బావాన్ని?
మౌనంగా నా కళ్ళు,
నీ మనసుతో మాట్లాడట్లేదు?
నీ హ్రదయం వినట్లేదు?
అది నిజం కానప్పుడు,
నా మాటలు పెడర్ధాలుగా మారి,
నీ హృదయాన్ని గాయపరచవూ?
నీ మనసుని ముక్కలు చెవ్వవూ?
ఇక,నేను మౌనాన్ని ఆశ్రయించక,
మాటలతో యుద్ధానికి దిగనా?
యుద్ధంలో గెలిచేది,నువ్వా,నేనా
అక్షరాలు మాట్లాడుతున్నాయి
పదాలు బావాలు పలుకుతున్నాయి
వాక్యాలు వ్యాకరణం పొందిక లేకున్నా
జీవితపు నిగూఢ సత్యాలు
తమలో దాచుకున్నాయి….
దాపరికాల్లో నిజాలున్నా
నమ్మేవారులేక ఇలా
ఒంటరిగా మిగిలిపోయాయి
మాటల్లో మర్మాలు తెలీక...
మదిలోని బావాలు బందీ అయితే ఇంతేనేమో