. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, August 11, 2013

నీకోసం మనసు మాత్రం మౌనంగా రోదిస్తూనే ఉంటుంది.

నీ మౌనం 
నా మనసును గాయం చేసింది
శూన్యంలో మాటలు వెతకలేక,
నాకు నేను మూగబోయినప్పుడు,
మాటల వర్షం కురుస్తుందేమో అని
ఎదురు చూస్తున్నా ఆత్రంగా
నీ హృదయం కరిగి,
మౌనం వీడి,
నా మాటల ప్రవాహంలో,
నీ హృదయం తడిపెయ్యాలని,
నీ కోసం వెతికే లోపు
కనుచూపు అంచుల్లో ఉంటావు,
హృదయపు అంచులను  మాత్రమే,
తాకగల నీ చిరునవ్వుల  చిరుసవ్వడి,

ఈ హృదయం పరిధి దాటలేని 

నా నిస్సహాయత,
ఎన్నటికి అర్థం 

చేసుకుంటుందో 
అర్దంకావడం లేదు
నోరు పలికే పలుకుల కన్నా,
హృదయం చెప్పే మౌనమే 

మేలని అనుకున్నావో ఏమో
నీ మౌనాన్ని అంగీకరించే క్రమంలో,
నీకోసం  మనసు 

మాత్రం మౌనంగా  
రోదిస్తూనే ఉంటుంది.
నీవు ఎప్పుడూ నింగివే,
నేను ఎన్నడూ నేలనే,
నింగి నేలల నడుమ,
మౌనం, మాటల ఘర్షణలో,
జ్వనించిన మెరుపు 

వెలుతురులో 
జీవితాన్ని వెతుక్కుంటూ….
సాగిపో నేస్తమా .. 

నాలాంటి వాళ్ళతో నీకేంటీ పని
ప్రపంచహం చాలాపెద్దది 

అని అనుకున్నావేమో
చుట్టూ వున్నా 

నీ స్నేహితుల్లో నేణు 
ఎక్కడ కనిపిస్తాను
కనిపించేంత మనసుకు 

దగ్గరగా నేను లేను కదా
అందుకే నేమో నాకు దూరంగా వుండీ
మౌనం అనే శిక్షతో వేదిస్తున్నావు
నీ మాటల ప్రవాహాన్ని మరొకరి సొంతం చేసి
నాకు మౌనాన్ని గిఫ్ట్ గా ఇచ్చావు 

ఎంతజాలిగుండో కదా
కానీసం నాకు  

మౌనాన్ని అన్నా ఇచ్చావని 
సంతోషిస్తున్నా ఏంటో జీవితం 
మనుషుల వింత  ప్రవర్తన