జాబిలి నవ్వుల జావళీలలో
విరిసిన మల్లెల పలకరింపులో
ఎం మాయ ఏమోగాని
విరిసేను పెదవుల మిసిమి నవ్వులు
మెరిసేను కన్నుల మెరుపు పువ్వులు
దూరాన ఆ నీలి గగనాల చూడు ......
మారాము చేసెను ఆ మబ్బు తెరలు
వెన్నెలతో మరి ఊసులాడుతూ
తెమ్మెరతో మరి వూయలూగుతూ
పరువాలు సయ్యాట లాడే
ప్రణయాల కేరింత సాగే ..........
పచ్చని పచ్చిక వేదిక పైనా
పున్నగ పువ్వుల పానుపు మీదా
పవలించే నీ అందాలను ఆస్వాదిస్తున్నాను
నీదరి చేరి నీవడిలో నేనెప్పుడు సేదతీరుతానో
విరిసిన మల్లెల పలకరింపులో
ఎం మాయ ఏమోగాని
విరిసేను పెదవుల మిసిమి నవ్వులు
మెరిసేను కన్నుల మెరుపు పువ్వులు
దూరాన ఆ నీలి గగనాల చూడు ......
మారాము చేసెను ఆ మబ్బు తెరలు
వెన్నెలతో మరి ఊసులాడుతూ
తెమ్మెరతో మరి వూయలూగుతూ
పరువాలు సయ్యాట లాడే
ప్రణయాల కేరింత సాగే ..........
పచ్చని పచ్చిక వేదిక పైనా
పున్నగ పువ్వుల పానుపు మీదా
పవలించే నీ అందాలను ఆస్వాదిస్తున్నాను
నీదరి చేరి నీవడిలో నేనెప్పుడు సేదతీరుతానో