. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, August 5, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(16)

1) నీ తలపులు కలలో కలవరపెడుతుంటే...
నిద్రలేని రాత్రుల్ల సాక్షిగా నీకోసం నన్ను నేను ఓదార్చుకోలేక నాలో నేను


2) నీకోసం నాతో నేను యుద్ధం చేసేదీ నేనే....గాయపడేదీ నేనే.

3) గుస గుసా పిలుస్తూ నా సమాధిని పలుకరిస్తున్నావు
మళ్ళీ సమాధి పక్కన నిలబడి విలపిస్తున్నావు..ఏంటో నాకు వింతగా అనిపిస్తుంది


4) హృదయం బ్రద్దలైన శబ్దం..అవి నీవు చేసిన అవమానాలు
భరించలేని నొప్పి గుండెను ఎవరో కోసేస్తున్నారు కన్నీరుకు గొంతు దగ్దం అయింది.


5) అన్ని అక్షరాల్నీ పదాల్ని ... వెదుక్కుంటున్నా
నీ గుండె స్పందనకు అక్షర రూపం ఇవ్వాలని ఆవేదనగా...?


6) ఎంత విచిత్రమో కదూ..నువ్వు...నేను..
అస్తిత్వ శిఖరాలపై అక్షరాల నిచ్చేనలేసుకుంటూ ఒకరికి దొరక్కుండా మరొకరం


7) వాడిపోయిన పూవుల్లా నీ కలలు వాడి రాలిపోతుంటే
నీ తోడులేక పోయినా ఆకాశంలో చుక్కవై జాబిల్లిలా వస్తావని ఎదురు చూస్తున్నా


8) నా గొంతులో బాధ బ్రతకలేక చావలేక
ఉక్కిరిబిక్కిరవుతూ నా గొంతుని నులిమి చంపేస్తుంది


9) నాకు నేను విచిత్రం నన్ను చదవాలనుకుంటే
నాలో ఎన్ని సూపర్ కంప్యూటర్లు పెట్టీనా మీ ఊహకందను


10) తగలబడే కారనాలు.. తగులబెట్టే క్షనాలనుంచి
ఎన్నాళ్ళని తప్పించుకుంటా ఏదో రోజు కాలి తగలబడి పోవాల్సిందేకదా


11) నిజాలు నిప్పు కణికలై కాలుస్తుంటే
గుండెల్లో మంటను పెట్టుకొని పైకి విరబడి నవ్వడం కష్టమే కదా


12) నాదన్న ప్రతి అక్షరం ఎదురుతిరుగుతోంది
నాస్వేచ్చను అడ్డుకునేందుకు నీవెవ్వరు అంటూ అడ్డంగా మాట్లాడుతోంది


13) నాలుగు కాలాలు నావనుకున్నా
అంతా నావాళ్లనుకుంటే ...మరి ఈ ఒంటరితనం దేనికి


14) గతం వర్తమానాన్ని చంపేసింది...
బ్రతుకు అనే పదంలో జీవచ్చవం మిగిలిపోయింది


15) గుండె భరించలేనంత భారంగా ఉంటోంది
నీ ఆలోచనలు రోజు రోజుకీ బరువెక్కుతున్నాయేంటో ప్రియా


16) ఎక్కడో నీస్వరం తియగా వినిపిస్తుంది
అదినీవేనా అని వెతికితే ఎక్కడా కనిపించవేంటి..బ్రమా..నిజమా


17) నీకోసం అన్ని దారుల్లో పోగొట్టుకున్న ప్రేమను వెతుక్కుంటూ
పారేసుకున్న సంతోషం ఎక్కడుందా అని అలుపనేది లేకుండా పరిగెత్తుతూనే ఉన్నా


18) మాటలన్నీటినీ దారాలతో ఏకం చేయాలని చూస్తున్నా
విడిపడాలని చూస్తున్న మాటలు దారాలను తెంచుకొని పారిపోతున్నాయి


19) అక్షరాలన్నీ కలిపి కవితగా నేస్తున్నా
ఒడుకుతున్నామాటలన్నీ దారాలుగా చేసి నాకు ఉరితాడు పేనుకొంటున్నా


20) ఓడిపోయిన ప్రతిసారి...రాతిరి కౌగిటిలో కరిగిపోతున్నా

21) నాపై సరదా పడ్డ మరణం..నా గుండెకి ప్రతిక్షనం వేస్తూనే ఉంది ఉరిశిక్ష

22)  భారమనుకుని వదిలేసిన క్షణాలు
కంకరరాళ్ళై నామీద దాడి చేసి చంపేస్తున్నాయి


23) ఆ స్వరం నీదేనేమో చీకటి చీల్చి
నా గుండె లోతుల్లో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది


24) ఎందుకో ఆక్షణం గుండె అరలలో మీ రూపం ..చప్పుడు చేయకుండా కదులుతుంది ..కళ్ళు మత్తుగా ముసుకొంటై..నాప్రాణం లో కలసిన వున్నా మీ మనసుని వెతకడం కోసం .

25) మనం కలుస్తున్నాం విడిపోతున్నాం ..కలయిక లో వున్నా తీపి జ్ఞాపకాలను ..ఎదురు చూపుల నిరీక్షణలో నెమరు వేసుకొంటూ క్షణ క్షణం భారం గా వెల్లదీస్తున్నా

26) కాలం విసిరేసిన దిక్కులలో ఇరుక్కుపోయిన "స్నేహం" కోసం
వెతుకుతున్నా మీకా "స్నేహం" కనిపిస్తే కాస్త ఆడ్రస్ దొరికితే చెప్పరూ


27) కలలు కత్తిరించి ఎర్రబడిన కళ్ళలో
చిరునవ్వు పెదాలకు అంటించుకొని నటించాలని చూస్తున్నా కష్టంగా


28) ఆ భాదనంతా కన్నీరుగా దోసిట్లో నింపితే
నా నివ్వెరపాటును ఎలా దాచుకోను..శిల్పంగా మారానెందుకో


29) నీ పెదాల్లోని పదాల్లో సానుబూతి ఒలికి పోయింది
మానిషిననే మాటే మర్చి అంతలా మారిపోయా వెందుకో ప్రియా


30) వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను గుప్పిట్లో దాచుకున్నా
దాన్ని దోచుకెలుతున్న ఆ అందాల సుందరి ఎవరు అదినీవేనా ప్రియా


31) ఎవరు? హృదయాంతరాలలో శూన్యతను
పదే పదే గుర్తుచేస్తున్నదెవరు నిజమా బ్రమనా....?


32) నామనసు నీకోసం శోధించటం ప్రశ్నించటం నేర్చుకుంది.
ఎన్ని మాటల మూటలు భుజానేసుకోవాలో తెలీక బిత్తర చూపులు చూస్తుంది


33) నేణు తనతో కల్సి నమ్మకం అనే తోటలో స్నేహం అనే మొక్కనాటాం
ఎవరుఎప్పుడు తెంచారో తేలీదు.. చూస్తే ఆమొక్కను ముక్కలు ముక్కలు చేశారు


34) కొందర్ని చూశా ఇంటిబైట బొచ్చుకుక్కపిల్లల్లా..
కొందరు అమ్మాయిలు ఏం కామెంట్స్ పెడతారాని ఎదురు చూస్తారు..?


35) అమ్మాయి పేరుతో ఏదిరాసినా విచిత్రమే
అమె నా కుక్కపల్ల బాగుందా అంటే చారు 1000 మంది స్పందన..


36) అమ్మాయిలు రాస్తే అన్ని లైకులూ కామెంట్లూ ఎందుకో
వాళ్ళు రాస్తే అర్దం మారదుగా ఎందుకా మానసిక ఆనందం ఏమాసించి..?


37) జీవితం అనే అనే పుస్తకంలో
పరిచయం అనే పేజీల్లో .."స్నేహం" అనే పదంలో నీవో అక్షరం నేనో అక్షరం


38) చెట్టు అందమైన పూల సమూహం..ప్రతి పువ్వుదీ ఒక ఏకాంత సమూహమే

39)  ఒకప్పుడూ " స్నేహం" అంటే నిఖార్సైన నిజం
ఇప్పుడు " స్నేహం" ఓ ఊసరవెళ్ళి.. ఎప్పుడు ఏక్షనంలో ఎలా మారుతుందో తెలీదు


40) మృత్యువే నీకెదుట నిలబడి ఈ రోజే నీకు ఆఖరని
రేపన్నది లేదంటే ఏం చేస్తావు..సంతోషంగా నవ్వుతాను ...?


41) నీవు చేసే అవమానాలకన్నా
మన హృదయం చెప్పే మౌనమే మేలుకదా...?


42) నా మాటల ప్రవాహంలో మౌనాన్ని వీడి
నీ హృదయం తడిపెయ్యాలని మదిహృదిలో స్నేహపు మొక్కలు కోసం


43) నీ మౌనం నా మనసుకు గాయం అయింది
శూన్యంలో మాటలు వెతకలేక నా మనస్సు మూగబోయింది


44) ఏదో ఒక రోజు మనము కాలంలో కలిసి పోతాము
కానీ మన జ్ఞాపకాలు మాత్రం అలా మిగిలి ఉంటాయి శాశ్వితంగా


45) పగలంతా ప్రతినిమిషం నీ అలోచనలు
రేయంత నువ్వులేని ఒంటరితనపు కలవరింతలు


46) మన గతాన్ని మౌనం ధ్వంసం చేసింది
మనసును సమూలంగా కూల్చేసింది నీ మౌనంతో


47) నీకూ నాకూ మధ్య ఉన్న నిశ్శబ్దం లో
నా గుండె చప్పుడు డీకోడై నీమాటల్లా మారి నాకు వినిపిస్తున్నాయి


48) దిగులు పురుగు గుండెను తొలుస్తున్నపుడు
ఆవేదనలో ఆక్రందనలా మిగిపోయావెందుకో కాస్త చెప్పవూ


49) ఒక మబ్బు తునక లో మెరుపై వస్తావు,
కానీ ఉరిమి భయ పెడతావు...చల్లని జళ్ళు కురిపిస్తావు ఏంటో


50) కన్నీటి చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే స్నేహo
ఒక చెంపపై నిశబ్దంగా జారే కన్నీటిని తుడవడానికి మరో హృదయం పడే తపనే ప్రేమ


51) ఎవరికైనా మరణం కనిపిస్తే కబురుపెడ్తారా
చాకా సీరియస్ గా మాట్లాడాలనిపిస్తుంది మరణంతో


52) పారేసుకున్న సంతోషాన్ని అన్వేషిస్తూ వెలుతుంటే
ఎక్కడ చూసినా నీవు నాకోసం పెట్టిన చితిమంటలే కనిపిస్తున్నాయి


53) మౌనం మాటున జరుగుతున్న సంభాషణ అంటే ఏంటో
నాకెందుకో నాలో వినిపిస్తున్న శబ్దాలన్ని నీవేకదా మౌనంగా మాట్లాడుతున్నావు కదా


54) ఇప్పుడు బ్రతకాల్సిన క్షణాలు చూడకుండా
జీవితం నుంచి కోల్పోయిన క్షనాలకోసం వెతున్నానేంటీ


55) కను రెప్పలతో తీసిన నీఫోటోలు జ్ఞాపకమై మదిలో ఆల్బంగామారాయి
ఆశగా ఆ ఆల్బంతీస్తే అన్నీనీఫోటోలే నీజ్ఞాపకాల్లో ఎమైనా ఉన్నానా కాస్త చెప్పవూ


56) గతకాలపు వర్తమానాన్ని గోనెసంచుల్లో నింపి
ప్రస్తుతాన్ని పైజేబులో పెట్టుకొని ఆశగా ఎదురు చూస్తున్నా


57) ఆ శబ్ధాల వెనుక వినిపించే ధ్వని నీ స్వరం
ఆ రాతలవెనుక నిండివున్న భావం నీ ధ్యాస


58) నీడలాంటి జ్ఞాపకాలని నీ ధ్యాసతో గానీ
శాంతింపచేయలేకున్నాను ఇంత చేసినా నీకు చేరువ కాలేకున్నాను


59) ఓపలేని బాధను చిరునవ్వుతో ముసేసాను
మన మధ్య వున్న దూరాన్ని దగ్గరగా చేసుకోవాలనే తపన


60) పెదవులు పైన మాటలు, ఏమి పలికినా
ఆ నోటి చివర మెదిలే పదం నీ పేరు నమ్ముతావా


61) ఓచిన్న చూపుకైన నోచుకోలేనన్న భాదతో
చేయి జారిన మనసుకై చీకటిలొ వెతుకులాట ఎప్పటిదాకో..?


62) నిన్ను చేరలేని దరిని చేరుకోవాలన్న తపన,
చేరువలో వున్నా చెంత చేరలేని తీరని ఆవేదన


63) నిన్న అన్నది తిరిగే రాదు, రేపు అన్నది తెలిసేం రాదు కదా..?

64) కాగితంపైన పదాలు ఒలికిస్తే ఎందుకో అవి కవితలయ్యాయి
నాకు తెలియకుండానే " కవి "నయ్యానని తల్చుకొన్న ప్రతిసారి నవ్వొస్తుంది


65) నాకు నేను చిక్కు ప్రశ్నల సంకేళ్ళేసుకుని
చీకట్లో బంధీనయ్యా..ఎప్పటికీ వెలుగనేది వద్దనిపిస్తోంది


66) కారు చీకటిలో ఏమి కానరాని అంధకారంలోకి వెళ్లానీరోజు
చీకటి చీల్చే సూర్య కిరణం నాలో వెలుగు నింపలేక ఈ రోజు ఓడిపోయింది


67) బయట బోరున వర్షం పడుతున్నా
గొంతులో తీరని దాహం ఎమైయింది నాకీవేళ


68) నీ మనసులో మౌన సంగీతం నా గుండెను తట్టింది
కలలన్నీ కరిగి కన్నుల్లోంచి కన్నీరు కాలువయి పారుతోంది


69) నీ మౌనంతో నా మది కారు మబ్బులు కమ్మిన
ఆకశామైంది కన్నీటి వర్షంగా కురుస్తోంది కనిపిస్తోందా నీకు


70) నువ్వు చూస్తున్న అద్దంలో ..నీకు బదులు నేను ఇది నిజమా..?

71)  నా దేహం మొత్తం కాలిన వాసన..
నా చితిపై మంటలు రక్తపు కాసారాలు కాగడాలైయ్యాయి


72) మృత్యువును మౌనంగా నన్ను ముద్దాడుతోంది
నా ప్రాణాలు నన్ను వీడి అమాంతం ఆవిరౌతోంది


73) నీ జ్ఞాపకాలు నా దేహాన్ని కూలుస్తున్నాయి
ముక్కలైన మనిషినై శిధిలావస్తలో ఉన్నా..పూర్తిగా మట్టిపాలౌతానేమో


74) ఆకాశంలో ఒద్దిగ్గా కూచునికారు మేఘాలన్నీ
చినుకు బలపాలతోనేల మీద అక్షరాభ్యాసం చేస్తున్నాయి


75) నా కళ్ళ కింద దాచిపెట్టిన..అసంపూర్తి కలవు నీనేనా?

76) నీ రెప్పల కింద వొణికిపోయిన..కన్నీటి చుక్కను నేనైయ్యానా ప్రియా            

77) ఓ మాట బంధాల్ని, బంధనాల్ని కత్తిరిస్తుంది
మనుష్యుల్ని, మనసుల్ని అదే మాట కలుపుతుంది


78) మరణానికి ముందో, వెనుకో..ఓ చిన్న మాట మాట్లాడవూ?

79) ఆకాశాని చిల్లు పడ్డట్టుంది
కాస్త దేవుడికి చెప్పండ్రాబాబు నీళ్ళన్నీ అయిపొతే ఎలా


80) రాలిపడిపోయిన క్షణాలన్నీ నన్ను దహిస్తున్నాయి
కన్నీటి కొలనులో నన్ను విసిరేసి ముంచేశాయి పైకిలేవకుండా


81) నెత్తురంటిన నా ప్రేమ అక్షరాలన్నీ
కనీసం పట్టించుకోకుండా పారబోసావు కదా ప్రియా


82) ఒకదానికొకటి అతకని అక్షరాలతో
అసంపూర్ణంగా ముక్కలైన భావం బరించలేని దుక్కాన్ని మిగిల్చింది


83) అలా విసురుగా ఓ చిరుజళ్ళు కెరటం
ముఖంపై చరిచి ఎక్కడో చెప్పలేని హాయినిచ్చింది క్షనకాలం


84) ఆ గాయపు గురుతులు నీవు పెట్టినవే కదా...?
నా కలల దేహంపై ఎర్రగా రక్తపు చారలు నీవే నన్ను కసిగా గోళ్ళతో రక్కావుగా


85) అక్షరాలన్నీ అనుభూతుల దారంతో కుట్టుకుంటున్నా
నా కవిత్వం లో నీకై వెతుకులాటలో నన్ను నేను పోగొట్టుకొని