కదిలిస్తే చాలు గుండె ఒలికి పోతుంది
పలకరిస్తే చాలు మనసు పులకించి పోతుంది
నీకోసం ఆలోచిస్తే చాలు తనువులో విద్యుత్తు ప్రవహిస్తుంది ఎలా ప్రారంభిచను ప్రియా
నాలోని నిన్ను మినహా
ఆహ్వానం లేకుండానే
నా హృదయంలో ప్రవేశించి
నా జీవిగా చెరగని ముద్ర వేసావు
విరామమెరుగని ఈ హృదయ యాత్ర
నీ కోసమై దిగ్దిగంతాలు సాగుతూనే ఉంది
ఎంత నీ నుండి దూరమైనా
ఏదో విధాన, ఏదో రూపాన
నా దృష్టిని నీ వైపు మరల్చుకుంటున్నావు
నీవు రావు నన్ను పోనీవు
మరల్చి, మత్తెక్కించి,స్వప్నాలతో లాలించి
మధుర గానాలతో ఊగించి
ప్రపంచానికి వ్యర్థుణ్ని చేసావు
దిగులు కళ్ళతో,
వెర్రి చూపులతో,
మరపు మాటలతో,
అన్ని విశ్వాసాలు నశించి
తోవ తెలియక తిరుగుతున్నాడీ ప్రేమ బైరాగి.
నీ కోసం వెతికి వెతికి అలసి
చిక్కి శల్యమయ్యే ఈ నిర్భాగ్యుణ్ని చూసి
దిక్కులే నవ్వాయి, చుక్కలే ఏడ్చాయి…
పలకరిస్తే చాలు మనసు పులకించి పోతుంది
నీకోసం ఆలోచిస్తే చాలు తనువులో విద్యుత్తు ప్రవహిస్తుంది ఎలా ప్రారంభిచను ప్రియా
నాలోని నిన్ను మినహా
ఆహ్వానం లేకుండానే
నా హృదయంలో ప్రవేశించి
నా జీవిగా చెరగని ముద్ర వేసావు
విరామమెరుగని ఈ హృదయ యాత్ర
నీ కోసమై దిగ్దిగంతాలు సాగుతూనే ఉంది
ఎంత నీ నుండి దూరమైనా
ఏదో విధాన, ఏదో రూపాన
నా దృష్టిని నీ వైపు మరల్చుకుంటున్నావు
నీవు రావు నన్ను పోనీవు
మరల్చి, మత్తెక్కించి,స్వప్నాలతో లాలించి
మధుర గానాలతో ఊగించి
ప్రపంచానికి వ్యర్థుణ్ని చేసావు
దిగులు కళ్ళతో,
వెర్రి చూపులతో,
మరపు మాటలతో,
అన్ని విశ్వాసాలు నశించి
తోవ తెలియక తిరుగుతున్నాడీ ప్రేమ బైరాగి.
నీ కోసం వెతికి వెతికి అలసి
చిక్కి శల్యమయ్యే ఈ నిర్భాగ్యుణ్ని చూసి
దిక్కులే నవ్వాయి, చుక్కలే ఏడ్చాయి…