ఎవరితోనో మాట్లాడుతూ..మరొకర్ని కించపరుస్తూ
ఇంకెవరికో సందేశాలు పంపుతుంటారు.
మాట మాటలో ఓ మెలిక..పిచ్చి ప్రాసలతో
మాటలవే మనుషులు మారుతున్నారు
అందరికీ అవే" ముచ్చట్లు " మరి
ఆనిజం తెల్సినప్పటి నుంచి
నిత్యం గుండెలో మెలితిప్పుతునే ఉంటుంది.
కానరాని చురక కస్సుమని గుచ్చుకోంటోంది
గమ్యాన్ని ఢీకొడుతూనే ఉంటుంది.
కళ్ళనుండి కన్నీరు కబురొకటి విడివడి
చేతనైతే డీకోడ్ చేసుకోమంటుంది.
మాటల మొనదేలిన కొమ్ములతో
నిజం నన్ను విచ్చలవిడిగా కుమ్మేస్తుంది
దారి చేసుకుని దూరెళ్లిపోవడమే తప్ప
ఎవరు గాయపడితేనేం?
ఎవడెటు పోతేనాకేంటి..చచ్చిపోతే నాకేంటి
ఎంత డామేజ్ జరిగిపోతేనేం?
పొగడ్తో- తెగడ్తో తెలుసుకోలేని శాల్తీ మాత్రం
అసలు అవసరం లేదు తానంతే అంటుంది
ఇప్పుడు ఎవర్ని ఎలా అర్థం చేసుకోవాలో
పాలుపోక- నీళ్లు నములుతూ
కూడలి దగ్గర నించున్న బాటసారిలా
ఒకటే సందిగ్థపడుతుంది ఆ "స్నేహం"
ఏంటో మౌనభాషలో ఏన్ని అర్దాలో
ఒక్కోసారి అర్థాల్నే మార్చేస్తుంది ఆ "స్నేహం".
ఇంకెవరికో సందేశాలు పంపుతుంటారు.
మాట మాటలో ఓ మెలిక..పిచ్చి ప్రాసలతో
మాటలవే మనుషులు మారుతున్నారు
అందరికీ అవే" ముచ్చట్లు " మరి
ఆనిజం తెల్సినప్పటి నుంచి
నిత్యం గుండెలో మెలితిప్పుతునే ఉంటుంది.
కానరాని చురక కస్సుమని గుచ్చుకోంటోంది
గమ్యాన్ని ఢీకొడుతూనే ఉంటుంది.
కళ్ళనుండి కన్నీరు కబురొకటి విడివడి
చేతనైతే డీకోడ్ చేసుకోమంటుంది.
మాటల మొనదేలిన కొమ్ములతో
నిజం నన్ను విచ్చలవిడిగా కుమ్మేస్తుంది
దారి చేసుకుని దూరెళ్లిపోవడమే తప్ప
ఎవరు గాయపడితేనేం?
ఎవడెటు పోతేనాకేంటి..చచ్చిపోతే నాకేంటి
ఎంత డామేజ్ జరిగిపోతేనేం?
పొగడ్తో- తెగడ్తో తెలుసుకోలేని శాల్తీ మాత్రం
అసలు అవసరం లేదు తానంతే అంటుంది
ఇప్పుడు ఎవర్ని ఎలా అర్థం చేసుకోవాలో
పాలుపోక- నీళ్లు నములుతూ
కూడలి దగ్గర నించున్న బాటసారిలా
ఒకటే సందిగ్థపడుతుంది ఆ "స్నేహం"
ఏంటో మౌనభాషలో ఏన్ని అర్దాలో
ఒక్కోసారి అర్థాల్నే మార్చేస్తుంది ఆ "స్నేహం".