. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, August 12, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(17)


1) నీలో పొగట్టుకున్న నన్ను నేను అన్వేషిస్తూ
నాలోకి నేను చేసే నిరంతర ప్రయాం ఆగదూ నీవాపలేవు...?


2) ఎవరన్నారు నేను ఫ్రేమలో ఓడిపోయానని..
నువ్వే నన్ను ఫ్రేమించడంలో ఘోరంగా ఓడి నన్ను వీడిపోయావు


3) జీవన పయనంలో ప్రతికలయిక విడిపోవడానికే
ఒడ్డుని తాకిన ప్రతి కెరటం అడుగుతుంది నేనెవర్నని..కాస్త సమాదానం చెప్పవూ..?


4) నువ్వు నడిచిన దారిలో పువ్వులు చాలా అందంగా కనిపించేవి నాకు..
ఎందుకో అనుకునేవాడ్ని..ఆ తర్వాతే తెల్సింది అవి నీ నవ్వులతో పొటీపడేవని..


5) బ్లడ్ బ్యాంకులు ఉన్నట్లే హార్ట్ బ్యాంకులు ఉంటే బాగుండు..
ఎవర్నో ఇష్టపడి హృదయం బద్దలయినపుడల్లా..కొత్త గుండె తెచ్చిపెట్టుకోవచ్చు


6) మొన్నెవరో అద్బుతమైన అందాన్ని నిర్వచించమన్నారు.. నేనేమో నీ పేరు చెప్పా...?

7) నీ జ్ఞాపకాలంటని మరో పుట్టుక కోసం ప్రతి రాత్రి మరణిస్తున్నా....
నా జ్ఞాపకాల సమాధి మీద పూసిన గడ్డిపూలనైనా స్వీకరిస్తావనే చివరి చూపు కోసం


8) పాత నాలా ఉండీ పోవాలని మనసు కోరట్లేదు
కొన్ని గాయాలు పచ్చిగా ఉంటేనే..శిక్ష కఠినంగా ఉంటేనే కసి తీరేట్టుగా లేదు నీకు


9) నీకోసం పరిగెత్తుతుంటే నీవు పారిపోతున్నావు
ఎంతదూరం పరుగెత్తను..ఎన్నిరోజులని పరిగెత్తను నేను మనిషినే కదా..?


10) వస్తావో..రావో తెలీదు..వస్తావన్న ఆశకూడా చేజారిపోతోంది
మూడు కాలాలు ఆరు ఋతువులు చివరగా లక్ష నిస్పృహలు గా అనిపిస్తోంది 


11) క్షణాలని కాపలాగా పెట్టి నీ రాక కోసం అందరినీ
అడిగి ,అడిగి నోరెండిపోయిన ప్రేమ నది ని నేనే మరి ఏం చేయను...?


12) తెల్లవారితే చీకటి వెలుగు కరిగిపోతున్న రాత్రుల్లు
జారిపోతున్న జ్ఞాపకం నిన్న మొన్నకి తేడాలు తెల్సుకోలేని గతం


13) నీతో నేణు ఊసులాడువేళ ఈ ప్రపంచాన్ని మరచిపోయాను
నీవు పలకరించని నిమిషానా నాలో నేను కుమిలిపోతున్నా..ఏంటో ఈ వేదాంతం


14) పదములు ఎన్నున్నా అనుక్షణం నే పలికే పదం నీ పేరు
వర్ణములు ఎన్నున్నా ప్రతి నిమిషం నాకు కనిపించేది నీ రూప లావణ్యమే


15) కనులు మూసి నిదురిస్తుంటే కలలో నీ జ్ఞాపకాలు
కనులు తెరిచి చూస్తే కనుల ఎదుట నీ తలపుల వయ్యారాలు ఏం చేయను ..?


16) నీవు నన్ను ద్వేషించినా ఆద్వేషంలో దాగిఉంటాను
నీవు మౌనంగా ఉన్నా, దాని వెనుక అంతరంగానై నీచుట్టూ తిరుగుతుంటాను


17) కరగని మనస్సు నీది, దాని జ్ఞాపకాలు దాచిన హృదయం నాది.
కవులకు అందని లాస్యం నీది, ఆ మైకంలో మునిగిఉన్న మనస్సు నాది.


18) నువ్వువెటకారంగా ఎవరితోనో అనిపించిన మాటలు గుర్తొచ్చి
నా హృదయాన్ని బరువెక్కిస్తున్నాయి..ఆ బరువు మోసే శక్తి నాలో లేదు


19) బాషపై పట్టు లేదు..పదాలు తడుముకుంటాను
భావం భారంగా మారినప్పుడు అక్షరాలు తిరబడతాయి..నాతో కలబడతాయి


20) నల్లటి మేఘం మనసంతా కమ్ముకుంది,
హృదయానికి చిల్లులు పడినట్టుంది బోరున కళ్ళు వర్షిస్తున్నాయి


21) ఎక్కడో ఏదో జరుగుతోంది..గజిబిజి గందరగోళం అందుకే
వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను గుప్పిట్లో పట్టాలని చూస్తున్నా


22) గుండెల్లో రగులుతున్న భాదను బంధీగా చేసి
చిరునవ్వును పెదవులపై అతికించుకొన్నా ఎవ్వరికీ ఏం తెలియకూడదని


23) ఒక్కో అక్షరం, ఒక్కో భావం..ఎప్పటికీ అసంపూర్తిగా మిగిలిపోయిన అల్లికలే

24)  ఒక్కో ఘటన, ఒక్కో సంఘటన..ఎప్పటికీ అంతు చిక్కని సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమాలే        

25) కడవల కొద్దీ తోడినా..ఊట బావిలా ఊరుతూనే ఉన్నాయి నీ జ్ఞాపకాలు         

26) నీవు ఎప్పుడూ నింగివే నేను ఎన్నడూ నేలనే,
నింగి నేలల నడుమ మౌనం, మాటల ఘర్షణలో కొట్టుకపోతున్నా


27) నోరు పలికే పలుకుల కన్నా,
హృదయం చెప్పే మౌనమే మేలనిపిస్తుంది ఒక్కోసారి


28) మౌనం, మాటల ఘర్షణలో జ్వనించిన మెరుపు
వెలుతురులో జీవితాన్ని వెతుక్కుంటూ….సాగిపో నేస్తమా ..


29) నిన్నకి నేటికి మధ్య సన్నని చీకటి సందులో
ఒదిగిన నా పాత జ్ఞాపకాలు నీకోసం బరువుగా వాలిపోయాయి దీనంగా


30) నా గుండెలు పగిలి, నీ మనసు విరిగిపోయి
నోరు తడారిన తరుణంలో.. నా మూగ భాష నీకు తెలుసా


31) చీకట్లో నన్ను కౌగిలించుకొని నీలోకలిపేసింది
వెలుగులో నా తోడుంటూ.. ఏకాంతంలోనూ నాతోనే ఉంటూ నన్నేవరని అడిగింది


32) నీ జ్ఞాపకాల వలలో చిక్కి బెదిరిన కళ్ళతో
చీకట్లో వణుకుతూ నీ జ్ఞాపకాలతో మనసు విలవిలలాడుతుంది.


33) ఎప్పటికీ మనసు గాయాలు పచ్చిగా ఉండి
శిక్ష కఠినంగా ఉంటేనే గానీ. నామీద నాకు ఈ కసి తీరేట్టుగా లేదు


34) ఈ గుండె లోతుల్లోని విషాదాన్ని
ఏమర్చి బ్రతుకు నడపాలన్న కోరిక నాకు ఏ కోశానా లేదు.


35) అరేయ్ జాగ్రత్త....నా ప్రేమను ముక్కలు చేశానని మిడిసిపడకు
నీ పుట్టుకలోనే మోసం ఉందని ప్రపంచం "చీ" కొట్టే రోజొస్తుంది కాస్కో


36) విరామమెరుగని ఈ హృదయ యాత్ర..నీ కోసమై దిగ్దిగంతాలు సాగుతూనే ఉంది      

37) నా హృదయంలో తొంగిచూడాలని చూడకు
అక్కడ నీవు చేసిన అవమాలతో గుండె మండుతోంది చూడలేవు


38) నన్ను విడిచె ప్రతి క్షణం నీ ఆలొచనలతో
చీకటి రాత్రుల్లో అనుభుతులు నా మనసును తడుముతున్నాయి,


39) ఏమి చెప్పాలో తెలియక..ఎందుకు ఈ అలజడి నాలో
ఎందుకు నా ఎదురుచూపులు నా ఆశయాలకు ఊపిరి పోసే మనసు కోసమా


40) నాది చేయి జారిపోతుంది అన్న బావం..
మనసు దాటి భాద రాదు ఎవరికి చెప్పాలో తెలియక పెదవి దాటి మాట రాదు ...


41) ఇన్నేళ్ళు గడిచాక నివ్వెరపాటును ఎలా దాచుకోను?
ఆ భాదనంతా కన్నీరుగా దోసిట్లో నింపితే బదులేలేని పలితాలే ఇవన్ని


42) జీవితమనే చదువుల పుస్తకంలో..కాలం పెట్టె పరీక్షలు రాసేది విధి రాతేనా?           

43) కలలు కత్తిరించిన కళ్ళతో
చిరునవ్వు పెదాల కతికించుకుని తలరాతని తేల్చేసావ్..?


44) మనసు ఇంకా తడిగానే ఉంది..పొడి బారలేదింకా
కాని ఆ కన్నీటి చెమ్మ నీ కళ్ళను చేరడం లేదెందుకో మరి


45) నా దేహాన్ని ముక్కలు చేస్తున్నారు..నన్ను తగలబెడుతున్నారు
ఆయినా ఎందుకో చెప్పలేని ఆనందం అది చేపిస్తున్నది నీవైనందుకు ..?


46) మాట్లాడే నీ అక్షరాలు ..మైమరపించే నీ అక్షరాలు
నన్నుమాత్రమే దూషిస్తున్నాయి ఎందుకనో ఇలా ఎప్పటిదాకా..?


47) నీ జ్ఞాకంలో నేను లేనేంటి..ఎంతవెతికినా కనిపించడంలేదు
నీ కోపంలో నేనెప్పుడో తగలబడీ పోయానుకదు ఎలా ఉంటాను మరి


48) నా మనస్సు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే
నీమనసేంటీ పురివిప్పిన నాట్యిమయూరిలా పగలబడి నవ్వుతోంది


49) నల్లని చిన్నటి నీ కురుల్ని చూసి చీకటి చిన్న బోయింది
ఆ చిన్నకురులను సింపుల్ గా వెనుక్కు అనటంలో ఓ సోయగం ఉంది


50) నీకోసం నీసంతోషంకోసం
కావల్నినన్ని దెబ్బలు నామనసుకు నేనే తగిలించుకున్నా


51) నీవు నాకు దూరం అయినప్పటినుంచి నాలో ఏదొ ఖాలీ
నాలోపలికి నేను వెళ్ళీచూసాను అంతా నీవై ఉన్నావేంటీ మరి నేనెక్కడ


52) నేనెప్పుడూ అసంపూర్తిగా మిగిపిపోతున్నా
వాస్తవాన్ని తొడుక్కోవాలని చూసినా ... దానిలోకిదూరలేకపోతున్నా


53) కనికరం లేని కాలం మనిద్దర్ని అక్కడే ఆపేసింది
ఇద్దరం మన పరియం దగ్గరే ఆగిపోయాము..ఎందుకో చెప్పగలవా


54) నీకు ఏదైనా సాద్యిమే కదా..?
ప్రేమను పంచనూగలవు ..అదే ప్రేమను తుంచనూ గలవు


55) ప్రతిసారి నీవిషయంలో నిజం అవ్వాలనుకుంటాను
కాని నేనెప్పుడు నీకు తెలియని అబద్దంగా మిగిలిపోతున్నానెందుకో


56) సాయంత్రానికి కూడా నేను లోకువయ్యాను
కాలాన్ని తొక్కేసినన్ను చీకట్లో కుక్కేసి పరిగెడుతోంది


57) అదేంటి కాలం నామీదనుంచి పోతోంది
నీవులేని నేను ఒంటర్ననా నన్ను తొక్కేసి పోతోంది వేగంగా


58) నీవిచ్చిన దిగులుతనం దీపంక్రింద..నీడలా నిర్వేదంగా ఒంటరిగా మిగిలి పోయాను                

59) ఉబకని నా కన్నీరు నీ ఎద సంద్రంలో
తుఫాను అలజడి సృష్టిస్తుంది...దానిలో నేనుకొట్టుకపోతున్నా


60) మనసులో నిలిచిన జ్ఞాపకాల గోపురం
ఒక్కసారిగా ఒక్కసారిగా ఒరిగి పోయింది ఎందుకో


61) ఓ చిన్న పొరపాటో తడబాటో..మౌనం ముక్కలై గుచ్చుకుంటుంది   

62) నీ పదునైన మాటలు మొనదేలిన కొమ్ములతో
నిజంమై నన్ను విచ్చలవిడిగా కుమ్మేస్తుంది రక్తం ఒడేట్టూ


63) కళ్ళనుండి కన్నీరు బొట్లు బొట్లుగా కారుతోంది నీకోసం
చేతనైతే డీకోడ్ చేసుకో నీ మనసుకు చేరని ఎన్నో భావాలు దాగుంటాయి


64) ప్రతి రాత్రి నీకోసం కట్టుకున్న పేకమేడలు
వేకువనే కూలుస్తున్నావెందుకు నాపై కోపం పోలేదా..?


65) ఓ జ్ఞాపకం నీకోసం ఎదురు చూస్తుంది
అది గుర్తొచ్చి ఆ స్వప్నం రోధిస్తుంది నివెప్పుడొస్తావని


66) వీచే౦దుకు గాలికి శక్తి నసించిందేమో
అందుకే ప్రేమ పరిమళాలు నన్ను చేరలేక పోతున్నాయి


67) సంతృప్తి నరకంలో నవ్వుతుందని..అసంతృప్తి స్వర్గంలో పొల్లిపొల్లి ఏడుస్తుంది      

68) పెదవి చెర దాటని నా గుండె లోని భావం మరవనివ్వదు
కనుపాపలు కురవనివ్వని నా కన్నీటి వర్షం ... మరవనివ్వదు ... నిన్ను


69) నేను కవిని కాదు నేను రాసేది కవిత్వంకాదు
మనసుపొరల్లో అలజడి ...నావన్నీ తాటాకు చప్పుల్లే


70) నా అంతరాత్మలోకి తొంగి చూడు..నువు లేని ఆత్మ మండిపోతూ కనిపిస్తుంది

71) నీవు నాకు సంతోషాన్ని ఇవ్వకపోయినా
నా భాధవై నాలో ఉండిపో... ఆరని అగ్నిలా నాలో మిగలిపో


72) కాలే గుండెనైన..కోసే గాయనైనా
నీ పలకరింపు తోనే మరచిపోవాలనుకుంటాను.


73) విషాదం విశ్వమంతా వ్యాపించినపుడు
నాకు నువున్నవనే స్వాంతనంలో నిశ్చింత పొందుతా


74) ఏంటో మౌనభాషలో ఏన్ని అర్దాలో..చేదించాలని ఎంత తొందరో
ఒక్కోసారి అర్థాల్నే మార్చేస్తున్న ఆ "స్నేహా" లతో జాగ్రత్త అని చెప్పానా


75) కూడలి దగ్గర నించున్న బాటసారిలా బిత్తరచూపులు చూస్తూ
ఒకటే సందిగ్థపడుతుంది దూరమైన ఆ "స్నేహం" దగ్గరకు రావాలా వద్దా అని


76) గాయపడకుండా ఉండాలని ఎంత జాగ్రత్త పడ్డా
ఎదురుపడి గాయాలు చేస్తుంటే తలవంచాను నీకోసం


77) మనసు ఎన్నడో గాయపడింది నీ మాటలకు
కన్నీళ్లతో కడిగి స్నేహపు జాడలను నిరంతరం శుభ్రం చేస్తున్నాను


78) మూసిన కనురెప్పల వెనక
పలకని తలపుల భావాలను..నీవు తెల్సుకునేదెలా..?


79) నాలో చిక్కుకుపోయిన పదాలు కొన్ని
గింజుకుంటూ నాలోనే మరణిస్తున్నాయి నీదగ్గరకు చేరలేక


80) పెదాల్లో పరిమళించని ఓ పువ్వు దాక్కొంది
ఆ పువ్వు నవ్వై చిగురించాలని చూస్తోంది నీ పలుకు కోసం


81) ఒక గుండె మోయలేని బాధల కోసం
కారనాలు వెతుక్కొంటూ ఎన్ని మెలికలు తిరుగుతుందో


82) కానరాని చురక కస్సుమని గుచ్చుకోంటోంది
గతం గతుకుల రోడ్డుపై గమ్యాన్ని ఢీకొడుతూనే ఉంటుంది


83) నా అంతరాత్మలోకి తొంగి చూడు..నువు లేని మది మండిపోతూ కనిపిస్తుంది      

84) కళ్ళతో నవ్వుతూ గుండెలో మంట పెడుతూ
మాడిపోయే క్షణాన చిరుజల్లై కురిసింది కన్నీరు నాకోసం


85) కలల అలలు సృష్టించి మనసుకు చిద్రం చేసింది
ప్రేమనే మహాసముద్రంలో ముంచేసి హాయిగా నిద్రపోతోంది


86) దొంగ చూపుల గాలాలతో గుండెకు గాయాలు చేసి
హృదయం కబళించి చల్లగా నవ్వింది నవ యవ్వనాల జవ్వని


87) నిశ్శబ్దంగా జారుకుంటోంది కాలం
రాత్రి గడుస్తోందటే చాలు..ఉదయం గురించి భయం


88) వేకువకి చీకటి కీ మధ్య ఎన్ని ఆశలో
అవన్నీ అనుభవంలోకి రాకుండానే గడుస్తోంది కాలం


89) పున్నమి రేయిలో చల్లని వెలుగులు చిందించే జాబిలి చుస్తే
ప్రేయసి వదనం కనిపిస్తుందని నీ రూపం నిండిన నా మనస్సు నిండా నీతలపులే


90) నా మనసుకు మాటలు నేర్పావు మాటల మంత్రం వేశావు
నా చూపులు నీపై నిలిచేలా చేశావు .. ప్రేమతో నన్ను ఎదో చేసేలా ఉన్నావు


91)చిరు నవ్వుల ఉరి విసిరేసి చిరు సైగతో మనసుని మార్చి
మనసుని ముక్కలు చేసావు.. శిల కాదిది మనసని మరువకే ఓ ప్రేమా . .


92) రాత్రి,లేదు పగలు లేదు ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో
నీ జ్ఞాపకాలు ఇంతేసి దిగులును మోసుకొస్తాయి నా గుండెను భారం చేస్తాయి


93) ఎండకు ఎండి ..వర్షానికి తడిసి అన్నీ కోల్పోయిన ప్రేమని
ఇంకా నిజమైన ప్రేమ ఎవరో ఒకరు భిక్షంగా వేయక పోరు అని ఎదురు చూస్తున్నా


94) ప్రాణం పోవడం అంటే ఇదేనా నువ్వెళ్ళి పోతున్నావు నాతో లేవన్న నిజం తెల్సాక
నన్నుకాదని మరొకరితో అన్ని అయి పోతున్నావన్న నిజాలు కొద్ది కొద్దిగా చంపేస్తున్నాయ్


95) కడలి ఆకాశానికి దూరంగా ఉంటూనే ఆవిరై చేరుతుంది
ఆకాశం కడిలికి దూరంగా ఉంటూనే తియ్యని వాన జల్లై వాలిపోతుంది


96) నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తానివై స్వాగతిస్తావా...
మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరనించేందుకు నేను సిద్దం


97)  నీమౌనానైనా విందామని నిన్ను మరచి బ్రతకలేక 
అలాగని గుర్తుంచుకొని చనిపోలేక ప్రేమించడం నేర్పిన నువ్వే మరచిపోవడం నేర్పుతావనే ఎదురుచూపు     

98) నీ జ్ఞాపకాలంటని మరో పుట్టుక కోసం ఈ రాత్రికి మరణిస్తున్నా...

99) నాది ప్రేమ కాదు ..'ఆరాధన'...ఎంతగా అంటే జరిగిపోయిన 
నీ గతాన్ని కూడా నా కళ్ళముందు దర్శింపచేసుకోవాలన్నంతగా..    

100) నీ పేరుని అందంగా  వ్రాయాలని కాలిగ్రఫీ ఎంతగా ప్రాక్టీసు చేసానో..నీ పేరుని అందరికంటే తియ్యగా పలకాలని సరిగమలు కూడా నేర్చుకున్నా.