నోరూరించే రంగు
పడుచు పిల్ల పెదాల్లా జివ్వుమనిపించే రూపం
బాటిల్ లో ఉన్నప్పుడు..కన్నెపిల్లలా
గ్లాస్ లో పోసినప్పుడు..పడుచుపిల్లలా
నీలోషోడా కలిపినప్పుడు..
సృంగార దేవతలా..
రమ్మని పిలుస్తున్నట్టు
మత్తుకల్లతో పిలుస్తున్నట్టు
గుందెళ్ళో గుబులు రెపే రూపం
చూడగానే మదిలో అలజడి,,
గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు
గుండె పడుతున్న వేదనకు సమాదానం నీవు
మనసు చచ్చినమనిషిని.. భాదలు తీర్చే
అద్బుతమైన టానిక్..
దేవతలకు అమృతం
మనిషి తనకు తాను
తయారు చేసుకున్న అమృతం
తప్పైనాతప్పని పరిస్థితుల్లో తాగాలని
గరళం అని తెలసీ
గొంతులో దిగే వరకు ఆత్రం ..
పెదాలపై చల్లని షోడా కలిపిన
ఆమందు.. పెదాలవద్ద పెట్టగానే
గుప్పుమనే...గంభీరమైన వాసన
తాగేముందు మొకం చిట్లంచినా
గొంతులోకి వెళ్ళేప్పుడు
వెచ్చగా కటిక చేదుగా
వడివడిగా ఆ మందు గుండెళ్ళో చేరగా
ఒక్కసారిగా స్వర్గం లో ప్రవేసించిన ఆనందం
అప్పటీదాకా వేదించిన నీజ్ఞాపకాలు
అప్పటీదాకా నన్ను వెంటాడిన జ్ఞాపకాలు
ఈ మందు గుండెళ్ళో దిగగానే
జ్ఞాపకాలు కూడా మనస్సును భాదించకుండా
ఈ మందు ప్రభావంతో జ్ఞాపకాలు మత్తులో
గమ్మత్తుగా మనసులో ఎటో ఎటో తిరుగుతాయి
మనసు ఆదీనం తప్పుతుంది
ఏం జరుగుతున్నదో ఏంచేస్తున్నామో
మనసుకే తెలీదు.. మత్తులో
గమ్మత్తైన అనుభవం
మరోలోకంలో విహారం
అక్కడ నేనే రాజు
నాదే ఆ రాజ్యిం
ఎవ్వరు ఏంచెప్పినా
మనసుకెక్కడు. అదీ కిక్కు మహిమ
తాగిన కిక్కులో.. నీవన్నవన్నీ గుర్తుకొస్తాయి
తాగనప్పుడు అవే జ్ఞాపకాలు ఏడిపిస్తాయి
మందు గుండెళ్ళో ఉన్నప్పుడు
భాదలో నాలో నేను నవ్వుకుంటాను
ఆనవ్వుకు అర్దం తెలీక చుట్టుపక్కల వాళ్ళు
వింతగా చూస్తారు అయినా అప్పుడూ నాలోకం వేరు
మనస్సు మూగగా రోదిసున్నా .. ఆమత్తులో
ఏమీ గుర్తుకు రావు వచ్చినా భాధ అనిపించదు
అప్పుడనిపించిస్తుందిప్రియా
రా ఇప్పుడు భాదపెట్టు చూద్దాం
నన్నేవరూ ఏం చేయలేరు
ఇప్పుడు నన్ను నేను నాకు నేను గొప్ప
ఎవ్వరితో సంబందం లేదు
గుండే చుట్టు చేరిన మందు
గుండేకు చిల్లులు పెడుతుంది
అయినా నీవు
చేసిన ద్రోహంలో ఇదో పెద్దలెక్క
సాయంత్రానికి ఇది గొంతులో దిగకపోతే
నన్ను నేను మర్చిపోతాను
నీవు లేనప్పుడు ఇదే ఇప్పుడు తోడు ప్రియా
ఈ మందు చావుకు దగ్గర చేస్తుందని తెల్సి
ఇప్పుడు నీకటే నాకు ఇదే ఎక్కువ
ఎదుకంటే నీవు పిలిస్తే రావు
కానీ ఇది పీవగానే వళ్ళో వాలిపోతుంది మరి