మనసు మీద కొట్టిన దెబ్బ
100 కత్తి పోట్లకన్నా
అనుబాంబ్ దాడికన్నా
ఒక్కసారిగా మెడను కత్తితో కోసినా
గుండెను కత్తులతో చీల్చినాన్
గుండెలో రక్తనాలాను సర్రున లాగినా
బరించొచ్చేమో గాని
మనసు తగిలిన గాయం
అది పెట్టే బాద చెప్పుకోలేనిది
ఇంతలా నా మనసుకు గాయం చేసి
ఏం సాదించావు ప్రియా
నీకూ నేనూ ఇంతలా భాదపడటం ఇష్టమా
నీవు కావాలని భాదపడాలనే ఇలా చేస్తున్నావా
ఓ మనిషి మనసుకు గాయం చేసి
మళ్ళీ ఎంతెలియనట్టు ఎలా ఉంటావు
అసలెందుకు ఇలా చేస్తున్నావు ప్రియా
నేను ప్రతిక్షనం బాదపడటమే కావాలా
నేను ప్రతిక్షనం ఏడ్వటమే నీకు ముఖ్యిమా
నేను బ్రతికున్న శవాన్ని అని తెల్సీ ఇలా
భాదపెడుతున్నావంటే నిజంగా నీవు గ్రేట్
నీకు నచ్చినట్టే చేయి
ఎంత భాదపెట్టాలో అంతా భాదపెట్టు
ఏదైనా నా ఊపిరి ఆగేదాకేగా
అప్పుడు నీకా చాన్స్ ఉండదు
ఇంకా ఇంకా భాద పెట్టూ
మళ్ళి మళ్ళీ ఆ అవకాశం నీకు రాదేమో