ప్రియానా ప్రాణం నీవే
ప్రణయం నీవే
ప్రళయం నీవే నీ...వే నీ ...........వే
కట్టలు తెగిన కన్నీళ్ళు చీకట్లో కలిసిపోతుంటే
ఓదార్చే ధైర్యం నీవు లేక ఒడిపోయాను ప్రియా
గది గోడలు మౌన సాక్షులుగా మిగిలిపోయాయి ప్రియా
ప్రియా జ్ఞాపకమై గుండెలో చేరి
మౌనాన్ని మంత్రంగా వేసి నిశ్సబ్ధం గా మరలిపోయావు
ప్రియా జ్ఞాపకాలు గుండెల్లో చేరి తీయని గాయం చేస్తున్నాయి
ప్రియా నీ మాటలతో ఆ మౌనం వీడేదెప్పుడు..ప్రియా
నీ ఓదార్పుతో నా గాయం మానేదెప్పుడు ప్రియా