Monday, August 20, 2012
ప్రియా మనసు పడే వేదనని ఎలా వినిపించను
ప్రియా జ్ఞాపకమై గుండెలో చేరి గాయంగా ఎందుకు నిలచిపోయావు
మౌనాన్ని మంత్రంగా వేసి నిశ్సబ్ధం గా మరలిపోయావు
ప్రియా జ్ఞాపకాలు గుండెల్లో చేరి తీయని గాయం చేస్తున్నాయి
నీ మాటలతో ఆ మౌనం వీడేదెప్పుడు
ప్రియా నీ ఓదార్పుతో నా గాయం మానేదెప్పుడు .
చూసే ప్రతి చూపులో నువ్వే కనిపిస్తు
ప్రియా వినే ప్రతి మాటలో నీ పిలుపే వినిపిస్తుంటే
మనసు పడే వేదనని ఎలా వినిపించను నీకు
ప్రియా కనులు మూసుకుని
కళ్ళలో ఉన్న నీ రూపాన్నే చూస్తూ ఉన్నా ప్రతి క్షణం
ఊపిరి ఆగే లోపు ఒక్కసారైనా
ప్రియా నా కళ్ళెదుట నిలిచిన నిన్ను చూడాలని..
నా గుండేళ్ళో దాగిన దాచుకున్న వన్ని నీకు తెలపాలని..?
ఈ జన్మకు ఈ కోరిక తీరేనా ప్రియా ...మది అడుగుతోంది చెప్పవూ
Labels:
కవితలు