ప్రియా నీ అందం నన్ను
మరపింపచేసింది
ప్రియా నా కనుపాపలలో
నీ రూపం..విడిచివెళ్ళనంటుంది
ప్రియా రెప్పల మాటున..కన్నీటి మాటున
అది దాగుండిపోయింది...
ప్రియా నిదురలోనూ నీ ప్రతిబింబం నన్ను..
మనసు పొరళ్ళో ...తట్టి లేపింది
ప్రియా నీ వెంటే నేనున్నానంటూ నన్ను
పలుకరించి ఎందుకలా దూరం అయ్యావు
ప్రియా నా ఉచ్చ్వాస నిశ్వాసలోనూ
నీ పూల పరిమళం
పూరించివేసింది
ప్రియా నా గుండె చప్పుడును
నీ తీయని మాటలు
నన్ను మాయ చేసింది
ప్రియా నా గుండే ప్రతి లయ నీ తోడు
కోరుకుంటూంది
ప్రియా దూరంగా ఉన్న
మన తనువులు
దగ్గరవ్వాలని
ఒక్కటైన మన హౄదయం
ఆశపడుతుంది..ఆశతీరేనా నాఊపిరి పోయేనా ప్రియా