Saturday, August 25, 2012
నా మనసు పడుతున్న వేదనను నీవు అర్దం చేసుకోగలవా ప్రియా
ప్రియా చూసే ప్రతి చూపులో నువ్వే కనిపిస్తు
వినే ప్రతి మాటలో నీ పిలుపే వినిపిస్తుంటే
ప్రియా మనసు పడే వేదనని ఎలా వినిపించను నీకు
కనులు మూసుకుని..నా మనస్సుతో ఆలోచించు ప్రియా
నీవే కావాలని నా మనస్సు ఎదురు చూపులు నీకేం తెల్సు
కళ్ళలో ఉన్న నీ రూపాన్నే చూస్తూ ఉన్నా ప్రతి క్షణం
ప్రియా ఊపిరి ఆగే లోపు ఒక్కసారైనా..
నా కళ్ళెదుట నిలిచిన నిన్ను చూడాలని
గొంతులో పలికే భావాన్ని నీకు వినిపిద్దామనుకుంటూన్నా
ప్రియా మనసులోని అలజడి తెలుసు కుంటావనుకున్నాను
కాని ఆర్ధం చెసుకునే ఆ మనసే నీకు లేదని అనిపిస్తోంది
నామనసు తెలిసిన నీ ఎందుకు గొంతు మూగ పోయింది
ప్రియా నీ ప్రేమతో నిండిన నా మనసేమో నీకోసం మారం చేస్తుంది ..
నేనేలా ఉండగలను మాట్లాడకుండా అని..సమాదానం చెప్పు ప్రియా
నాదైన గొంతుని ఆపగలిగాను కాని
ప్రియా నాది కాని ఈ మనసుని ఎలా ఆపగలను ?
నామనస్సు ఎప్పుడో నీదైపోయింది.. అది నామాట వినటంలేదు ప్రియా
నీతో మాట్లాడలనుకునే మాటలని గుండెల్లోనే అదిమిపెడుతుంటే
ప్రియా కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్నే అభిషేకిస్తున్నాయి
ఎందుకో నీ కోసం కన్నీరు కార్చినా ఆనందంగానే ఉంది
ఎందుకంటే నీ మనసుని తాకలేని నా మాటలు
ప్రియా కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్ని తాకుతున్నందుకు..
నా మనసు పడుతున్న వేదనను నీవు అర్దం చేసుకోగలవా ప్రియా
Labels:
కవితలు