Wednesday, August 8, 2012
ప్రియా నిశ్శబ్ద యుద్దంలో నీవు గెలిచి ..నన్నోడించావు"
ప్రియా ఏకాంతంలో ఒక్కడినే
నీ కోసం ఎదురు చూడటం
ప్రేమంటే ..
హృదయపు మైదానం మీద
ప్రియా నీ తలపుల వానలో తడిసి పోవటం
ప్రేమంటే
ప్రియా ఆత్మలు ..
రెండే రెండు మనసులు
కలిసే అరుదైన సంఘటన
ప్రేమంటే
నువ్వు ఎక్కడో ఉన్నా
నీ మదిలో సవ్వడిగా
మారిపోయేది ప్రేమంటే
ప్రేమ ఓ ఉద్విగ్నమైన అభినివేశం
ఓ అరుదైన ఆలాపన
నీ కనుల కొలనులో
సాగే నిరంతర స్వాతి చినుకు
ప్రేమంటే ..
నువ్వు నన్ను వెలివేశావు
నేను నిన్ను నాలో దాచుకున్నాను
నీ కోసం పరితపిస్తూ సాగిపోతా
నువ్వన్నది నిజం
నేనన్నది అబద్దం..
మనిద్దరి మద్యి జరుగుతున్న
ప్రియా నిశ్శబ్ద యుద్దంలో నీవు గెలిచి ..నన్నోడించావు"
నాకు నావిజయం కంటే .. నీగెలుపు ముఖ్యిం
ప్రియా నిశ్శబ్ద యుద్దంలో ఓడిన నేను.. పారిపోతున్నా
ఎక్కడికి పోతున్నానో .. గమ్యిం ఏంటో తెలీదు
కాని ఒక్కటి నిజం ..ఎప్పటికైనా నేను గుర్తుకొస్తాను
ప్రియానాకోసం తప్పకుడా వెతుకుతావు ...అప్పుడు ...?
నీ కన్నీటి నుంచి రాలి పడే కన్నీటి బోట్టే
పైన ఉన్న నాఆత్మకు శాంతి నిస్తుంది ప్రియా
Labels:
కవితలు